Gold Rates | మగువలకు షాక్‌.. భారీగా పెరిగిన పసిడి, వెండి ధరలు.! హైదరాబాద్‌ తులం రూ.69వేలకు చేరువగా..!

Gold Rates | మగువలకు బంగారం ధరలు మళ్లీ షాక్‌ ఇచ్చాయి. పార్లమెంట్‌లో కేంద్రం ప్రవేశపెట్టిన బడ్జెట్‌లో దిగుమతి సుంకాలను భారీగా తగ్గించిన విషయం తెలిసిందే. అప్పటి నుంచి పడిపోతూ వచ్చిన ధరలు బుధవారం బులియన్‌ మార్కెట్‌లో మరోసారి భారీగా పెరిగాయి.

Gold Rates | మగువలకు షాక్‌.. భారీగా పెరిగిన పసిడి, వెండి ధరలు.! హైదరాబాద్‌ తులం రూ.69వేలకు చేరువగా..!

Gold Rates | మగువలకు బంగారం ధరలు మళ్లీ షాక్‌ ఇచ్చాయి. పార్లమెంట్‌లో కేంద్రం ప్రవేశపెట్టిన బడ్జెట్‌లో దిగుమతి సుంకాలను భారీగా తగ్గించిన విషయం తెలిసిందే. అప్పటి నుంచి పడిపోతూ వచ్చిన ధరలు బుధవారం బులియన్‌ మార్కెట్‌లో మరోసారి భారీగా పెరిగాయి. 22 క్యారెట్ల గోల్డ్‌పై రూ.800 పెరిగి తులానికి రూ.64వేలకు ఎగిసింది. 24 క్యారెట్ల బంగారం రూ.870 పెరిగి తులానికి రూ.69,820కి పెరిగింది. ఇక వెండి ధర ఏకంగా కిలోకు రూ.2వేలు పెరిగింది. దేశంలోని వివిధ నగరాల్లో బంగారం ధరలను పరిశీలిస్తే.. చెన్నైలో పసిడి 22 క్యారెట్ల తులానికి రూ.64,250 ఉండగా.. 24 క్యారెట్ల గోల్డ్‌ రూ.70,090కి చేరింది. దేశ రాజధాని ఢిల్లీలో 22 క్యారెట్ల పసిడి రూ.64,150 ఉండగా.. 24 క్యారెట్ల బంగారం రూ.69,970కి ఎగిసింది. ముంబయిలో 22 క్యారెట్ల గోల్డ్‌ రూ.64వేలు ఉండగా.. 24 క్యారెట్ల బంగారం రూ.69,820కి పెరిగింది.

హైదరాబాద్‌లో 22 క్యారెట్ల పసిడి రూ.64వేలు ఉండగా.. 24 క్యారెట్ల పుత్తడి రూ.69,820కి చేరింది. ఏపీలోని తిరుపతి, విజయవాడ, విశాఖపట్నం నగరాల్లోనూ ఇవే ధరలు కొనసాగుతున్నాయి. ఇక వెండి ధర భారీగా పెరిగింది. కిలోకు రూ.2వేలు పెరగడంతో దేశ రాజధాని ఢిల్లీఓల కిలో ధర రూ.రూ.86,500 పలుకుతున్నది. హైదరాబాద్‌లో కిలో వెండి ధర రూ.91వేలకు చేరింది. బంగారం, వెండి ధరలు రాష్ట్రాలను బట్టి మారుతుంటాయి. ఆయా రాష్ట్రాల్లోని పన్నుల ఆధారంగా ధర మారుతూ వస్తుంది. మరో వైపు ప్రపంచవ్యాప్తంగా జరిగే వివిధ పరిణామాలపైనే ధరలు ఆధారపడి ఉంటాయి. ఈ క్రమంలోనే అంతర్జాతీయంగా ధరలు పెరిగినా, తగ్గినా ఆ ప్రభావం భారత మార్కెట్లపై సైతం ఉంటుంది. ద్రవ్యోల్బణం, సెంట్రల్‌ బ్యాంకుల నిర్ణయాలు, వడ్డీ రేట్లలో మార్పులు, మార్కెట్లలో బంగారానికి ఉన్న డిమాండ్‌ తదితర కారణాల నేపథ్యంలో బంగారం ధరలు మారుతూ వస్తుంటాయి.

Read Also : 

Chappal Price Hike | చెప్పులు కొత్తవి కొనాలనుకుంటే వెంటనే కొనేయండి..! రేపటి నుంచి మోత మోగనున్న ధరలు..!

Amazon Great Freedom Festival Sale | కొత్త స్మార్ట్‌ఫోన్లు కొనాలనుకుంటున్నారా..? ఆగండి ఆగండి..! అమెజాన్‌ గ్రేట్‌ ఫ్రీడమ్‌ సేల్‌ వచ్చేస్తోంది..!

PMAY | సొంతింటి క‌ల క‌నేవారికి గుడ్ న్యూస్‌.. పీఎం ఆవాస్ యోజ‌న కింద గృహ రుణాల‌పై వ‌డ్డీ రాయితీ.. ద‌ర‌ఖాస్తు చేసుకోండి ఇలా..!