Gold Rates | సామాన్యలకు షాక్‌.. మరోసారి పెరిగిన బంగారం, వెండి ధరలు..!

కొనుగోలుదారులకు బంగారం ధరలు షాక్‌ ఇచ్చాయి. బులియన్‌ మార్కెట్‌లో పసిడి ధర సోమవారం పెరిగింది. 22 క్యారెట్ల బంగారంపై రూ.200 పెరిగి.. తులానికి రూ.66,050కి ఎగిసింది.

  • By: Somu |    business |    Published on : May 06, 2024 11:56 AM IST
Gold Rates | సామాన్యలకు షాక్‌.. మరోసారి పెరిగిన బంగారం, వెండి ధరలు..!

Gold Rates | కొనుగోలుదారులకు బంగారం ధరలు షాక్‌ ఇచ్చాయి. బులియన్‌ మార్కెట్‌లో పసిడి ధర సోమవారం పెరిగింది. 22 క్యారెట్ల బంగారంపై రూ.200 పెరిగి.. తులానికి రూ.66,050కి ఎగిసింది. 24 క్యారెట్ల పసిడిపై రూ.220 పెరగడంతో తులం ధర రూ.72,050కి పెరిగింది. అదే సమయంలో వెండి ధర సైతం భారీగానే పెరిగింది. కిలోకు రూ.1000 పెరిగి కిలోకు రూ.84వేలకు చేరింది.

దేశంలోని వివిధ నగరాల్లో బంగారం ధరలను పరిశీలిస్తే.. చెన్నైలో 22 క్యారెట్ల పసిడి రూ.66,100 ఉండగా.. 24 క్యారెట్ల గోల్డ్‌ రూ.72,110 పలుకుతున్నది. ముంబయి నగరంలో 22 క్యారెట్ల బంగారం రూ.66,050 ఉండగా.. 24 క్యారెట్ల పుత్తడి రూ.72,050కి ఎగిసింది. దేశ రాజధాని ఢిల్లీ నగరంలో 22 క్యారెట్ల గోల్డ్‌ రూ.66,200 ఉండగా.. 24 క్యారెట్ల స్వర్ణం రూ.72,200కి పెరిగింది.

ఇక హైదరాబాద్‌లో 22 క్యారెట్స్‌ పసిడి రూ.66,050 ఉండగా.. 24 క్యారెట్ల బంగారం రూ.72,050 పలుకుతున్నది. ఏపీలోని తిరుపతి, విశాఖపట్నం, విజయవాడతో పాటు పలు ప్రాంతాల్లోనూ ఇవే ధరలు కొనసాగుతున్నాయి. మరో వైపు వెండి ధర సైతం భారీగా పెరిగింది. రూ.1000 పెరగడంతో కిలో ధర ఢిల్లీలో రూ.84వేలకు ఎగిసింది. హైదరాబాద్‌లో కిలో వెండి రూ.87,500 ధర పలుకుతున్నది.