Gold Price Today | రూ.1.25లక్షల దిశగా బంగారం ధరల పరుగులు!
బంగారం ధర రూ.1.23 లక్షలు దాటింది. దీపావళి నాటికి 10 గ్రాముల పసిడి ధర రూ.1.25 లక్షలకు చేరుకోవచ్చని నిపుణుల అంచనా.
న్యూఢిల్లీ : బంగారం ధర రోజురోజుకు పెరుగుతూ సరికొత్త రికార్డులు సృష్టిస్తోంది. బుధవారం 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1.23, 320 లక్షలు దాటింది. మరోవైపు అంతర్జాతీయ విపణిలో ఔన్సు పసిడి ధర 4వేల డాలర్లు దాటింది. . దీపావళి నాటికి 24 క్యారెట్ల బంగారం ధర 10 గ్రాములకు రూ.1.25 లక్షలు దాటవచ్చని అంచనా వేస్తున్నారు నిపుణులు. దీపావళి, పెళ్లిళ్ల సీజన్ అంటే బంగారానికి భారీ డిమాండ్ ఉంటున్న నేపథ్యంలో ఈ ఏడాదిలో రూ.1.50లక్షలకు బంగారం ధర పెరిగినే అశ్చర్యం లేదంటున్నారు.
అంతర్జాతీయంగా పరిణామాలు ఇలాగే ఉంటే.. ఈ ఏడాది బంగారం ధర భారీగా పెరిగేందుకు కారణమవుతుందని నిపుణులు చెబుతున్నారు. అమెరికా ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్ల హెచ్చు తగ్గులు, డాలర్ తో పాటు రూపాయి విలువ హెచ్చు తగ్గులు, ప్రపంచ వ్యాప్తంగా ఉద్రిక్తతలు.. ట్రంప్ టారిఫ్లు, కేంద్రీయ బ్యాంకుల బంగారం కొనుగోళ్లు వంటి పరిణామాలతో బంగారం రేట్లు మరింత పెరుగవచ్చంటున్నారు.
X
Google News
Facebook
Instagram
Youtube
Telegram