Gold Rate | బంగారం ధరలు సామాన్యులకు ఊరటనిస్తున్నాయి. వరుసగా రెండురోజు పసిడి ధర తగ్గింది. బులియన్ మార్కెట్లో గురువారం స్వల్పంగా దిగివచ్చాయి. 22 క్యారెట్ల బంగారంపై రూ.100 తగ్గి తులానికి రూ.66,150కి తగ్గింది. 24 క్యారెట్ల బంగారం రూ.110 తగ్గి తులానికి రూ.72,160కి దిగివచ్చింది.
Gold Rate | బంగారం ధరలు సామాన్యులకు ఊరటనిస్తున్నాయి. వరుసగా రెండురోజు పసిడి ధర తగ్గింది. బులియన్ మార్కెట్లో గురువారం స్వల్పంగా దిగివచ్చాయి. 22 క్యారెట్ల బంగారంపై రూ.100 తగ్గి తులానికి రూ.66,150కి తగ్గింది. 24 క్యారెట్ల బంగారం రూ.110 తగ్గి తులానికి రూ.72,160కి దిగివచ్చింది. దేశంలోని వివిధ నగరాల్లో బంగారం ధరలను పరిశీలిస్తే.. చెన్నైలో 22 క్యారెట్ల బంగారం రూ.66,150 ఉండగా.. 24 క్యారెట్ల బంగారం రూ.72,160కి తగ్గింది.
ముంబయిలో 22 క్యారెట్ల బంగారం రూ.66,150 ఉండగా.. 24 క్యారెట్ల పుత్తడి రూ.72,160కి దిగివచ్చింది. దేశ రాజధాని ఢిల్లీలో 22 క్యారెట్ల పుత్తడి రూ.66,300 ఉండగా.. 24 క్యారెట్ల బంగారం రూ.72,310కి చేరింది. హైదరాబాద్లో 22 క్యారెట్ల పసిడి రూ.66,150 ఉండగా.. 24 క్యారెట్ల గోల్డ్ రూ.72,160 పలుకుతున్నది. ఏపీలోని విజయవాడ, తిరుపతి, విశాఖపట్నం నగరాల్లోనూ ఇవే ధరలు కొనసాగుతున్నాయి.
మరో వైపు వెండి ధర స్వల్పంగా పెరిగింది. రూ.200 పెరిగి ఢిల్లీలో కిలో రూ.85,200కి ఎగిసింది. హైదరాబాద్లో రూ.88,700కి పెరిగింది. వాస్తవానికి ప్రపంచవ్యాప్తంగా జరిగే వివిధ పరిణామాలపైనే ధరలు ఆధారపడి ఉంటాయి. ఈ క్రమంలోనే అంతర్జాతీయంగా ధరలు పెరిగినా, తగ్గినా ఆ ప్రభావం భారత మార్కెట్లపై సైతం ఉంటుంది. ద్రవ్యోల్బణం, సెంట్రల్ బ్యాంకుల నిర్ణయాలు, వడ్డీ రేట్లలో మార్పులు, మార్కెట్లలో బంగారానికి ఉన్న డిమాండ్ తదితర కారణాల నేపథ్యంలో బంగారం ధరలు మారుతూ వస్తుంటాయి.