Today Silver Price : వెండి భగభగ..ఒకేసారి రూ.4వేలు పైకి!
వెండి ధరలు భారీగా పెరిగి ఒక్క రోజులోనే రూ.4వేలు ఎగిసిపోయాయి. దీంతో కిలో వెండి 1.80 లక్షలకు చేరింది. అటు బంగారం ధరలు స్వల్పంగా తగ్గి నిలకడగా కొనసాగుతున్నాయి.
విధాత, హైదరాబాద్: చలికాలంలో వెండి ధరలు సెగలు పుట్టిస్తున్నాయి. గురువారం ఒక్క రోజునే వెండి ధర రూ.4వేలు పెరిగి కొనుగోలు దారులకు షాక్ ఇచ్చింది. దీంతో కిలో వెండి ధర 1లక్ష 80వేలకు పెరిగింది. మూడు రోజుల్లో వెండి ధర ఏకంగా రూ.9వేలు పెరుగడం గమనార్హం.
అటు బంగారం ధరలు మాత్రం స్వల్పంగా తగ్గాయి. 24 క్వారెట్ల 10 గ్రాముల బంగారం 1లక్ష 27 వేల 750గా ఉంది. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 1 లక్ష 17 వేల 100 రూపాయలు ఉంది. పెళ్లిళ్ల సీజన్ కొనసాగుతుండటం…నూతన సంవత్సరం సమీపిస్తున్న నేపథ్యంలో వెండి, బంగారం ధరలు నిలకడగా కొనసాగడం లేదా పెరుగడం ఉండవచ్చని అంచనా వేస్తున్నారు.
X
Google News
Facebook
Instagram
Youtube
Telegram