Gold Rates | బంగారం ధరలకు బ్రేక్‌.. హైదరాబాద్‌లో నేడు ధరలు ఇవే..

Gold Rates Hike | గతంలో ఎన్నడూ లేనివిధంగా పెరుగుతూ వచ్చిన ధరలు కాస్త కొనుగోలుదారులకు బ్రేక్‌ ఇచ్చాయి. ఇటీవల పసిడి ధరలు రికార్డు స్థాయిలో పెరిగిన విషయం తెలిసిందే. శనివారం పసిడి ధర స్వల్పంగా తగ్గగా.. వెండి ధర నిలకడగా కొనసాగుతున్నాయి.

Reported by: Mallanna | వాణిజ్యం | Nov 02, 2024, 10:48 am IST
Read Time: 3 mins
Gold Rates | బంగారం ధరలకు బ్రేక్‌.. హైదరాబాద్‌లో నేడు ధరలు ఇవే..

Gold Rates | గతంలో ఎన్నడూ లేనివిధంగా పెరుగుతూ వచ్చిన ధరలు కాస్త కొనుగోలుదారులకు బ్రేక్‌ ఇచ్చాయి. ఇటీవల పసిడి ధరలు రికార్డు స్థాయిలో పెరిగిన విషయం తెలిసిందే. శనివారం పసిడి ధర స్వల్పంగా తగ్గగా.. వెండి ధర నిలకడగా కొనసాగుతున్నాయి. 22 గోల్డ్‌పై రూ.150 తగ్గి.. తులానికి రూ.74,400కి ఎగిసింది. 24 క్యారెట్ల పసిడిపై రూ.80,400కి తగ్గింది. దేశంలోని వివిధ నగరాల్లో ధరలను పరిశీలిస్తే.. దేశ రాజధాని ఢిల్లీ నగరంలో 22 క్యారెట్ల పసిడి రూ.73,800 ఉండగా.. 24 క్యారెట్ల పుత్తడి రూ.80,550కి పతనమైంది. చెన్నై నగరంలో 22 క్యారెట్ల బంగారం రూ.73,700 ఉండగా.. 24 క్యారెట్ల స్వర్ణం రూ.80,400కి తగ్గింది. ముంబయిలో 22 క్యారెట్స్‌ బంగారం రూ.73,700 ఉండగా.. 24 క్యారెట్ల పుత్తడి రూ.80,400కి పడిపోయింది.

ఇక హైదరాబాద్‌లో 22 క్యారెట్ల బంగారం రూ.73,700 ఉండగా.. 24 క్యారెట్ల పసిడి రూ.80,400 ధర పలుకుతున్నది. ఇక ఏపీలోని విజయవాడ, విశాఖపట్నం, తిరుపతి నగరాల్లోనూ ఇవే ధరలు కొనసాగుతున్నాయి. ఇదిలా ఉండగా.. వెండి నిలకడగా కొనసాగుతున్నది. ఢిల్లీలో కిలో వెండి ధర రూ.97వేలు పలుకుతున్నది. హైదరాబాద్‌లో రూ.1,06,000 వద్ద ట్రేడువుతున్నది. అయితే, ఇటీవల బంగారం ధరల పెరుగుదలకు ప్రధాన కారణం అమెరికా అధ్యక్ష ఎన్నికలు కారణంగా పేర్కొంటున్నారు. ఈ సారి అధ్యక్ష ఎన్నికలు హోరాహోరీగా సాగనున్నాయి. ట్రంప్‌, కమలా హారిస్‌లో ఎవరు గెలుస్తారనే ఉత్కంఠ నెలకొన్నది. ఎన్నికల నేపథ్యంలో స్టాక్‌ మార్కెట్లు ఒడిదుడుకులను ఎదుర్కొంటున్నాయి. ఈ నేపథ్యంలో మదుపరులు బంగారంపై పెట్టుబడులు పెడుతున్నారు. ఎందుకంటే బంగారం పెట్టుబడి సురక్షితంగా భావిస్తుంటారు. ఈ క్రమంలో ధరలు పెరుగుతున్నట్లు మార్కెట్‌ నిపుణులు పేర్కొంటున్నారు.