Gold Rate | పసిడి ప్రియులకు గుడ్‌న్యూస్‌.. బంగారం ధర తగ్గింది..!

Gold Rate | పసిడి ప్రియులకు శుభవార్త. బులియన్‌ మార్కెట్‌లో బంగారం ధర స్వల్పంగా తగ్గింది. మార్కెట్‌లో 22 క్యారెట్ల బంగారంపై రూ.350 తగ్గి తులానికి రూ.66,250కి పతనమైంది. 24 క్యారెట్ల బంగారంపై రూ.380 పతనమై రూ.72,250కి చేరింది.

Reported by: Mallanna | వాణిజ్యం | Apr 25, 2024, 10:49 am IST
Read Time: 3 mins
Gold Rate | పసిడి ప్రియులకు గుడ్‌న్యూస్‌.. బంగారం ధర తగ్గింది..!

Gold Rate | పసిడి ప్రియులకు శుభవార్త. బులియన్‌ మార్కెట్‌లో బంగారం ధర స్వల్పంగా తగ్గింది. మార్కెట్‌లో 22 క్యారెట్ల బంగారంపై రూ.350 తగ్గి తులానికి రూ.66,250కి పతనమైంది. 24 క్యారెట్ల బంగారంపై రూ.380 పతనమై రూ.72,250కి చేరింది. అదే సమయంలో వెండి ధర స్వల్పంగా తగ్గింది. దేశంలోని వివిధ నగరాల్లో బంగారం ధరలను పరిశీలిస్తే.. చెన్నైలో 22 క్యారెట్ల బంగారం రూ.67,100 ఉండగా.. 24 క్యారెట్ల బంగారం రూ.73,200కి దిగివచ్చింది. ముంబయిలో 22 క్యారెట్ల బంగారం రూ.66,250 ఉండగా.. 24 క్యారెట్ల పుత్తడి రూ.72,270కి దేశ రాజధాని ఢిల్లీలో 22 క్యారెట్ల పుత్తడి రూ.66,400 ఉండగా.. 24 క్యారెట్ల బంగారం రూ.72,420 ధర పలుకుతున్నది.

హైదరాబాద్‌లో 22 క్యారెట్ల పసిడి రూ.66,250 ఉండగా.. 24 క్యారెట్ల గోల్డ్‌ రూ.72,270కి తగ్గింది. ఏపీలోని విజయవాడ, తిరుపతి, విశాఖపట్నం నగరాల్లోనూ ఇవే ధరలు కొనసాగుతున్నాయి. మరో వైపు ధర పడిపోయింది. కిలోకు రూ.400 తగ్గడంతో ఢిల్లీలో రూ.82,500 తగ్గింది. ప్రస్తుతం హైదరాబాద్‌లో రూ.86వేలు పలుతున్నది. వాస్తవానికి ప్రపంచవ్యాప్తంగా జరిగే వివిధ పరిణామాలపైనే ధరలు ఆధారపడి ఉంటాయి. ఈ క్రమంలోనే అంతర్జాతీయంగా ధరలు పెరిగినా, తగ్గినా ఆ ప్రభావం భారత మార్కెట్లపై సైతం ఉంటుంది. ద్రవ్యోల్బణం, సెంట్రల్‌ బ్యాంకుల నిర్ణయాలు, వడ్డీ రేట్లలో మార్పులు, మార్కెట్లలో బంగారానికి ఉన్న డిమాండ్‌ తదితర కారణాల నేపథ్యంలో బంగారం ధరలు మారుతూ వస్తుంటాయి.