Gold Rate | బంగారం ధర భారీగా తగ్గిందోచ్‌..! ఇప్పుడు కొంటేనే బెటర్‌..!

Gold Rate | కొనుగోలుదారులకు బంగారం ధరలు భారీగా ఊరటనిస్తున్నాయి. బులియన్‌ మార్కెట్‌లో బుధవారం పసిడి ధర భారీగా పతనమైంది. 22 క్యారెట్ల బంగారంపై రూ.1,000 తగ్గి తులం రూ.65,550కి పడిపోయింది.

Reported by: Mallanna | వాణిజ్యం | May 01, 2024, 11:18 am IST
Read Time: 3 mins
Gold Rate | బంగారం ధర భారీగా తగ్గిందోచ్‌..! ఇప్పుడు కొంటేనే బెటర్‌..!

Gold Rate | కొనుగోలుదారులకు బంగారం ధరలు భారీగా ఊరటనిస్తున్నాయి. బులియన్‌ మార్కెట్‌లో బుధవారం పసిడి ధర భారీగా పతనమైంది. 22 క్యారెట్ల బంగారంపై రూ.1,000 తగ్గి తులం రూ.65,550కి పడిపోయింది. 24 క్యారెట్ల బంగారం రూ.1,090 తగ్గి రూ.71,510కి దిగివచ్చింది. దేశంలోని వివిధ నగరాల్లో బంగారం ధరలను పరిశీలిస్తే.. చెన్నైలో 22 క్యారెట్ల బంగారం రూ.66,350 ఉండగా.. 24 క్యారెట్ల బంగారం రూ.72,380కి తగ్గింది. ముంబయిలో 22 క్యారెట్ల బంగారం రూ.65,550 ఉండగా.. 24 క్యారెట్ల పుత్తడి రూ.71,510కి చేరింది.

దేశ రాజధాని ఢిల్లీలో 22 క్యారెట్ల పుత్తడి రూ.65,700 ఉండగా.. 24 క్యారెట్ల బంగారం రూ.71,660కి దిగివచ్చింది. హైదరాబాద్‌లో 22 క్యారెట్ల పసిడి రూ.65,550 ఉండగా.. 24 క్యారెట్ల గోల్డ్‌ రూ.71,510 పలుకుతున్నది. ఏపీలోని విజయవాడ, తిరుపతి, విశాఖపట్నం నగరాల్లోనూ ఇవే ధరలు కొనసాగుతున్నాయి. మరో వైపు ధర స్వల్పంగా తగ్గింది. రూ.500 తగ్గి ఢిల్లీలో కిలో బంగారం రూ.83వేలకు చేరింది. ప్రస్తుతం హైదరాబాద్‌లో రూ.86,500 పలుతున్నది. వాస్తవానికి ప్రపంచవ్యాప్తంగా జరిగే వివిధ పరిణామాలపైనే ధరలు ఆధారపడి ఉంటాయి. ఈ క్రమంలోనే అంతర్జాతీయంగా ధరలు పెరిగినా, తగ్గినా ఆ ప్రభావం భారత మార్కెట్లపై సైతం ఉంటుంది. ద్రవ్యోల్బణం, సెంట్రల్‌ బ్యాంకుల నిర్ణయాలు, వడ్డీ రేట్లలో మార్పులు, మార్కెట్లలో బంగారానికి ఉన్న డిమాండ్‌ తదితర కారణాల నేపథ్యంలో బంగారం ధరలు మారుతూ వస్తుంటాయి.