Gold Rates | భగ్గుమంటున్న బంగారం ధరలు.. హైదరాబాద్‌లో కొత్త ధరలు ఇలా..!
Gold Rates | బంగారం ధరలు( Gold Rates ) మగువలకు షాకిస్తున్నాయి. కొందామంటే కూడా కొనలేని పరిస్థితి. రోజురోజుకు పసిడి ధరలు పరుగులు పెడుతుండడంతో.. పెళ్లిళ్లు చేసే కుటుంబాలు తీవ్ర ఆందోళనకు గురవుతున్నాయి.

Gold Rates | ఎండలు ముదిరేకొద్ది భారీగా ఉష్ణోగ్రతలు నమోదైనట్టు.. బంగారం ధరలు కూడా రోజురోజుకు భగ్గుమంటున్నాయి. సామాన్యుడికి అందకుండా.. పసిడి ధరలు ఆకాశాన్నంటుతున్నాయి. ఇది పెళ్లిళ్ల సీజన్ కూడా కావడంతో.. అమాంతం పెరిగిన బంగారం ధరలతో సామాన్యులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. బంగారం కొనేది ఎలా అని మదనపడుతున్నారు. గత నాలుగైదు రోజుల నుంచి బంగారం, వెండి ధరలు ఏ మాత్రం తగ్గడం లేదు.
ఇవాళ( మార్చి 21) హైదరాబాద్ మార్కెట్‌లో బంగారం ధరలు ఎలా ఉన్నాయంటే.. 22 క్యారెట్ల బంగారం ధర రూ. 83,110(నిన్న రూ. 83.100) కాగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ. 90,670(నిన్న రూ. 90,660) గా ఉంది. ఇక 18 క్యారెట్ల బంగారం ధర విషయానికి వస్తే 10 గ్రాముల బంగారం ధర రూ. 68,001గా ఉంది. కిలో వెండి ధర హైదరాబాద్ మార్కెట్‌లో రూ. 1,14,200 గా ఉంది. ఇక ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా కూడా బంగారం, వెండి ధరలు ఇలానే ఉన్నాయి.
ఢిల్లీలో 22 క్యారెట్ల బంగారం ధర రూ. 83,260, 24 క్యారెట్ల బంగారం ధర రూ. 90.820గా ఉంది. ముంబై, బెంగళూరు, చెన్నై, కోల్‌కతాలో రూ. 83,110(22 క్యారెట్), రూ. 90,670(24 క్యారెట్) గా ఉంది.