Gold Rates | పసిడి పరుగో పరుగు.. తెలుగు రాష్ట్రాల్లో రూ.80వేల మార్క్‌ దాటిన బంగారం.. రూ1.12లక్షలకు వెండి

Gold Rates | పసిడి ధరలు పరుగులు తీస్తున్నాయి. గతంలో ఎన్నడూ లేనివిధంగా సరికొత్త రికార్డులను నెలకొల్పుతున్నది. వెండి తులం ధర రూ.80వేల మార్క్‌ను దాటింది. మరో వైపు వెండి సైతం కిలోకు రూ.1.12లక్షలకు ఎగిసింది. తాజాగా బుధవారం బులియన్‌ మార్కెట్‌లో 22 క్యారెట్ల గోల్డ్‌పై రూ.400 పెరిగి తులానికి రూ.73,400కి చేరింది.

Gold Rates | పసిడి పరుగో పరుగు.. తెలుగు రాష్ట్రాల్లో రూ.80వేల మార్క్‌ దాటిన బంగారం.. రూ1.12లక్షలకు వెండి

Gold Rates | పసిడి ధరలు పరుగులు తీస్తున్నాయి. గతంలో ఎన్నడూ లేనివిధంగా సరికొత్త రికార్డులను నెలకొల్పుతున్నది. వెండి తులం ధర రూ.80వేల మార్క్‌ను దాటింది. మరో వైపు వెండి సైతం కిలోకు రూ.1.12లక్షలకు ఎగిసింది. తాజాగా బుధవారం బులియన్‌ మార్కెట్‌లో 22 క్యారెట్ల గోల్డ్‌పై రూ.400 పెరిగి తులానికి రూ.73,400కి చేరింది. ఇక 24 క్యారెట్ల బంగారంపై రూ.430 పెరిగి.. తులానికి రూ.80,070 మార్క్‌ని అందుకున్నది. ఇక వెండి ధర సైతం మరోసారి భారీగా పెరిగింది. కిలోకు ఏకంగా ఒకే రోజు రూ.2వేలు పెరిగి తులం రూ.1.12లక్షలు పలుకుతున్నది.

ఇక దేశంలోని వివిధ నగరాల్లో బంగారం ధరలను పరిశీలిస్తే.. చెన్నైలో బంగారం 22 క్యారెట్ల తులానికి రూ.73,400 ఉండగా.. 24 క్యారెట్ల పసిడి రూ.80,070కి పెరిగింది. ఢిల్లీలో 22 క్యారెట్ల బంగారం రూ.73,550 ఉండగా.. 24 క్యారెట్ల బంగారం రూ.80,220 ఎగిసింది. ముంబయిలో 22 క్యారెట్ల గోల్డ్‌ రూ.73,400 ఉండగా.. 24 క్యారెట్ల బంగారం రూ.80,070కి పెరిగింది. హైదరాబాద్‌లో 22 క్యారెట్ల పసిడి రూ.73,400 ఉండగా.. 24 క్యారెట్ల పసిడి రూ.80,070 పలుకుతున్నది. ఏపీలోని విజయవాడ, విశాఖపట్నం, తిరుపతితో పాటు మిగతా అన్ని నగరాల్లోనూ ఇవే ధరలు పలుకుతున్నాయి. ఓ వైపు వెండి ధర సైతం పెరిగింది. కిలోకు రూ.2వేలు పెరిగి ఢిల్లీలో కిలో బంగారం ధర రూ.1.04లక్షలకు ఎగిసింది. ఇక హైదరాబాద్‌లో కిలో వెండి రూ.1.12లక్షలు పలుకుతున్నది.

వాస్తవానికి బంగారం, వెండి ధరలు రాష్ట్రాలను బట్టి మారుతూ వస్తుంటాయి. ఆయా రాష్ట్రాల్లోని పన్నుల ఆధారంగా ధరలో తేడాలుంటాయి. అదే సమయంలో ప్రపంచవ్యాప్తంగా జరిగే వివిధ పరిణామాలపై ధర ఆధారపడి ఉంటుంది. అంతర్జాతీయంగా ధరలు పెరిగినా, తగ్గినా ఆ ప్రభావం భారత మార్కెట్లపై సైతం పడుతుంది. ద్రవ్యోల్బణం, సెంట్రల్‌ బ్యాంకుల నిర్ణయాలు, వడ్డీ రేట్లలో మార్పులు, మార్కెట్లలో బంగారానికి ఉన్న డిమాండ్‌ తదితర కారణాల నేపథ్యంలో బంగారం ధరలు మారుతూ వస్తుంటాయి. అలాగే, వివిధ దేశాల మధ్య జరిగే యుద్ధాలు సైతం ధరలపై ప్రభావం చూపుతుంది.