Gold Silver Price Today : పండుగ వేళ పసిడి, వెండి ధరల షాక్
సంక్రాంతి వేళ షాకిస్తున్న బంగారం, వెండి ధరలు! 10 గ్రాముల పసిడి ₹1.42 లక్షలు దాటగా, కిలో వెండి ₹2.87 లక్షలకు చేరింది. 2026లో వెండి ₹3.2 లక్షలకు చేరుతుందని అంచనా.
విధాత, సంక్రాంతి పండుగ వేళ పసిడి, వెండి ధరలు కొనుగోలుదారులకు షాక్ ఇస్తున్నాయి. 24 క్యారెట్ల 10గ్రాముల బంగారం ధర సోమవారం రూ.1690పెరిగి రూ.1,42,150కి చేరింది. 22క్యారెట్ల 10గ్రాముల బంగారం ధర రూ.1550పెరిగి రూ.1,30,300 వద్ద కొనసాగుతుంది.
పెరుగుదల బాటలో వెండి ధరలు
వెండి కిలో ధర రూ.12000పెరిగి రూ.2,87,000 వద్ద కొనసాగుతుంది. మూడు రోజుల వ్యవధిలో కిలో వెండి ఏకంగా రూ.19000పెరుగడం వెండి ధరల జోరుకు నిదర్శనం. 2025 ఏప్రిల్‌లో రూ.90 వేలు వద్ద ఉన్న వెండి ధరలు డిసెంబర్ నాటికి ఏకంగా రూ.2.5 లక్షల స్థాయికి చేరాయి. 2025లో 150శాతం పెరిగిన వెండి ధరలు 2026లో రూ.3,20,000వరకు చేరడం ఖాయమని ప్రముఖ దేశీయ బ్రోకరేజ్ సంస్థ మోతీలాల్ ఓస్వాల్ అంచనా వేస్తున్నారు.
ఇవి కూడా చదవండి :
Donald Trump : వెనెజువెలా తాత్కాలిక అధ్యక్షుడిని నేనే అంటూ ట్రంప్ సంచలన ప్రకటన
Samyuktha Menon | సంయుక్త మీనన్ ను ఇంత హాట్ గా ఎప్పుడు చూసుండరు భయ్యా.. ఇంకెందుకు లేటు ఒక లుక్ వేసేయండి!
X
Google News
Facebook
Instagram
Youtube
Telegram