విధాత, హైదరాబాద్ : ఇరాన్ తో అమెరికా, ఇజ్రాయెల్ యుద్దం నేపథ్యంలో బంగారం ధరలు మరింత పతనమవుతున్నాయి. మంగళవారం బులియన్ మార్కెట్ లో 24క్యారెట్ల 10గ్రాముల బంగారం ధర రూ. 2,940 రూ.1,40,350 కి పడిపోయింది. 22క్యారెట్ల 10గ్రాముల బంగారం ధర రూ. 2,700 తగ్గి రూ. 1,28,650కి పతనమైంది. వెండి ధరలు సైతం మరింత తగ్గాయి. కిలో వెండి ధర రూ. 10,000తగ్గి రూ. 2,40,000కు దిగివచ్చింది.
పశ్చిమాసియాలో కమ్ముకున్న యుద్ధ మేఘాలతో పసిడి ధరలు కుప్పకూలుతున్నాయి. ట్రంప్ యుద్ధంపై ప్రకటించిన 5 రోజుల విరామం పెట్టుబడిదారులను డాలర్ వైపు మళ్లించింది. డాలర్ మరింత శక్తివంతంగా మారి బంగారంపై ఒత్తిడిని కొనసాగిస్తోంది. దీంతో బంగారం ధరలు మళ్లీ నేల చూపులు చూస్తున్నాయి. స్టాక్ మార్కెట్ నష్టాలను పూడ్చుకోవడానికి ఇన్వెస్టర్లు బంగారాన్ని అమ్మేయడం కూడా పసిడి ధరల పతనానికి కారణంగా నిలిచింది. స్టాక్ మార్కెట్లలో వస్తున్న భారీ నష్టాలను పూడ్చుకోవడానికి పెట్టుబడిదారులు త్వరగా అమ్ముడుపోయే బంగారం, వెండి వంటి ఆస్తులను విక్రయించి నగదును సమకూర్చుకుంటున్నారు. దీనివల్ల సరఫరా పెరిగి ధరలు మరింత వేగంగా పడిపోతున్నాయి.
మొత్తంగా జనవరి 29న ఆల్ టైమ్ రికార్డు ధరలు నమోదు చేసిన బంగారం, వెండి ధరలు రోజురోజుకు పడిపోవడం పసిడి పెట్టుబడుదారులను ఆందోళనకు గురి చేస్తుంది. ఆల్ టైమ్ రికార్డు ధర రూ. 1,78,850వద్ద నుంచి బంగారం ప్రస్తుతం రూ.1,40,350కి పడిపోవడం గమనార్హం. అదే రోజు రూ.4,25,000గా ఉన్న కిలో వెండి ధర నేడు రూ.2,40,000కి పతనమవ్వడం విశేషం.
ఇవి కూడా చదవండి :
Lok Sabha Assembly Seats Increase | లోక్‌సభ, అసెంబ్లీ స్థానాలు 50శాతం పెంపు బిల్లు!
Raasi | టాలీవుడ్‌లో అందరూ బాబులే .. నేను మిక్స్డ్ బ్రీడ్ అంటూ రాశి ఆసక్తికర కామెంట్స్ వైరల్
