Lok Sabha Assembly Seats Increase | లోక్‌సభ, అసెంబ్లీ స్థానాలు 50శాతం పెంపు బిల్లు!

లోక్ సభ, అసెంబ్లీ స్థానాల సంఖ్యను 50శాతం పెంచాలని కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఇందుకు సంబంధించిన బిల్లును ప్రస్తుత పార్లమెంటు సమావేశాల్లోనే ప్రవేశ పెట్టాలని నిర్ణయించుకుంది.

Reported by: Y.V. Narsimha Reddy | Latest News | Apr 04, 2026, 2:23 pm IST
Read Time: 5 mins
Lok Sabha Assembly Seats Increase | లోక్‌సభ, అసెంబ్లీ స్థానాలు 50శాతం పెంపు బిల్లు!

(వై.వెంకటనరసింహారెడ్డి)

లోక్ సభ, అసెంబ్లీ స్థానాల సంఖ్యను 50శాతం పెంచాలని కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఇందుకు సంబంధించిన బిల్లును ప్రస్తుత పార్లమెంటు సమావేశాల్లోనే ప్రవేశ పెట్టాలని నిర్ణయించుకుంది. సీట్ల పెంపు బిల్లు విషయమై ఇప్పటికే తమ ఎన్డీఏ భాగస్వామ్య పక్షాలతో చర్చించిన కేంద్రం ప్రతిపక్షాలతో సైతం చర్చించాలని నిర్ణయించింది. కేంద్రం నిర్ణయం మేరకు లోక్ సభ స్థానాల సంఖ్య 543 నుంచి 816కి పెరగనుంది. దేశ వ్యాప్తంగా అసెంబ్లీల స్థానాల సంఖ్య 4,123 నుంచి 6,185 పెరుగనుంది. లోక్ సభ నియోజవర్గాల పునర్విభజన తర్వాతా మహిళలకు 816అసెంబ్లీ స్థానాల్లో 273సీట్లు రిజర్వ్ కానుండటం విశేషం.

తెలుగు రాష్ట్రాలలో భారీగా పెరుగనున్న అసెంబ్లీ, లోక్ సభ స్థానాలు

తెలంగాణలో అసెంబ్లీ స్థానాల సంఖ్య 119నుంచి 179కి పెరుగనుంది. ఆంధ్రప్రదేశ్‌లో 175స్థానాల నుంచి 263కి చేరనున్నాయి. అలాగే తెలంగాణలో లోక్ సభ స్థానాల సంఖ్య 17నుంచి 26కు, ఏపీలో లోక్ సభ స్థానాల సంఖ్య 25 నుంచి 38కి చేరుకోనున్నాయి.

ఈ పార్లమెంటు సమావేశాల్లోనే బిల్లు

నియోజకవర్గాల సంఖ్య పెంచడానికి వీలుగా ముందుగా మహిళా రిజర్వేషన్ చట్టం, డీలిమిటేషన్ చట్టాలకు సవరణలు ప్రతిపాదిస్తూ ప్రస్తుత పార్లమెంటు సమావేశాల్లో బిల్లు ప్రతిపాదిస్తారు. లోక్ సభలో బిల్లు ఆమోదం పొందిన తర్వాత కేంద్రం వెంటనే డీలిమిటేషన్ కమిషన్ ఏర్పాటు చేసి సీట్ల పెంపు కార్యక్రమాన్ని పూర్తి చేసి 2029 ఎన్నికల్లో అమలు చేయాలని నిర్ణయించింది. అలాగే సీట్ల పెంపు థామాషా ప్రకారం ఎస్సీ, ఎస్టీల రిజర్వ్ స్థానాలు పెరుగనున్నాయి.

పెంచే సీట్లు, మహిళ రిజర్వేషన్లతోనే 2029ఎన్నికలు

నిజానికి 2023సెప్టెంబర్ లో ఆమోదించిన మహిళా రిజర్వేషన్ బిల్లు ప్రకారం 2034నుంచి 33శాతం మహళా రిజర్వేషన్లు అమలు కావాల్సి ఉంది. అలాగే రాజ్యంగలోన 170(3), 81(3) అధికరణాల మేరకు 2026 తర్వాత ప్రచురించే జనాభా లెక్కల ఆధారంగా దేశంలో నియోజకవర్గాల పునర్విభజన చేయాల్సిన నిబంధన ఉంది. అయితే జన గణన 2027మార్చి 1కల్లా జనగణన పూర్తవ్వనుండటంతో ప్రాథమిక జనాభా లెక్కల వివరాలు ప్రకటించి ఆ వెంటనే నియోజకవర్గాల పునర్విభజన చేపట్టే అవకాశం ఉంది. జనగణన తర్వాత నియోజకవర్గాల పునర్విభజన చేస్తే ఉత్తర, దక్షిణ భారత రాష్టాల మధ్య సీట్ల పెంపులో తేడాలు వచ్చే సమస్య ఉంది. అందుకే అన్ని రాష్ట్రాల్లో సగటున లోక్ సభ, అసెంబ్లీ సీట్లు 50శాతం పెంచాలని కేంద్రం నిర్ణయించింది. తద్వార 2029ఎన్నికలను పెంచిన సీట్లతో పాటు మహిళా రిజర్వేషన్ అమలుతో నిర్వహించాలని కేంద్రం కసరత్తు చేస్తుంది.

ఇవి కూడా చదవండి :

Lok Sabha, Assembly seats increase| లోక్‌సభ, అసెంబ్లీ స్థానాలు 50శాతం పెంపు బిల్లు!
Ustaad bhagat Singh | ఉస్తాద్ భగత్ సింగ్’కు ఓవర్సీస్‌లో గట్టి షాక్.. బాక్సాఫీస్ వద్ద తగ్గుతున్న కలెక్షన్స్