మరింత పతనమైన బంగారం, వెండి ధరలు

శనివారం బులియన్ మార్కెట్ లో 24క్యారెట్ల 10గ్రాముల బంగారం ధర రూ. 490 తగ్గి రూ.1,44,330కి పడిపోగా, 22క్యారెట్ల 10గ్రాముల బంగారం ధర రూ. 450 తగ్గి రూ.1,32,300 వద్ద నిలిచింది. కిలో వెండి ధర సైతం రూ.100 తగ్గి 2,44,900 వద్ద నిలిచింది.

పశ్చిమాసియాలో అమెరికా-ఇరాన్ మధ్య పెరుగుతున్న సైనిక ఉద్రిక్తతలు, ద్రవ్యోల్బణ భయాలు ప్రపంచవ్యాప్తంగా బులియన్ మార్కెట్‌ను తీవ్రంగా ప్రభావితం చేస్తున్నాయి. ముడి చమురు సరఫరా వ్యవస్థ మరోసారి దెబ్బతింటూ ఇంధన ధరల పెరుగుదలకు కారణమవుతుండగా..అంతర్జాతీయ మార్కెట్‌లో బంగారం ధరలు పడిపోతున్నాయి. దేశీయ మార్కెట్ లో సైతం బంగారం, వెండి ధరలు మరింత పతనమయ్యాయి.

శనివారం బులియన్ మార్కెట్ లో 24క్యారెట్ల 10గ్రాముల బంగారం ధర రూ. 490 తగ్గి రూ.1,44,330కి పడిపోగా, 22క్యారెట్ల 10గ్రాముల బంగారం ధర రూ. 450 తగ్గి రూ.1,32,300 వద్ద నిలిచింది. కిలో వెండి ధర సైతం రూ.100 తగ్గి 2,44,900 వద్ద నిలిచింది.

మరింత తగ్గుతాయా..?

అమెరికా-ఇరాన్ ఉద్రిక్తతలతో పాటుగా.. యూఎస్ ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్ల విధానం, ద్రవ్యోల్భణం, డాలర విలువల నేపథ్యంలో బంగారం ధరలు ప్రస్తుత స్థాయిల నుండి గరిష్టంగా మరో 5 శాతం వరకు మాత్రమే పతనం ఉండవచ్చని నిపుణులు అంచనా వేస్తున్నారు.ఈ నేపథ్యంలో దేశీయ కొనుగోలుదారులకు.. ముఖ్యంగా పెళ్లిళ్లు, పండుగల కోసం బంగారు ఆభరణాలు కొనాలనుకునే వారికి ఇది ఒక చక్కని అవకాశంగా నిపుణులు చెబుతున్నారు. ధరలు ఇంకా తగ్గుతాయనే ఆశతో కొనుగోళ్లను వాయిదా వేసుకోవడం అంత శ్రేయస్కరం కాదని.. ఎందుకంటే దేశీయ మార్కెట్‌లో రూ. 1.35 లక్షల వద్ద బంగారానికి చాలా బలమైన మద్దతు (పునాది) ఉందని వారు స్పష్టం చేస్తున్నారు.

Latest News