స్థిరంగా బంగారం, వెండి ధరలు

సోమవారం బులియన్ మార్కెట్ లో బంగారం, వెండి ధరలు వరుసగా రెండో రోజు కూడా స్థిరంగా నిలిచాయి. 24క్యారెట్ల 10గ్రాముల బంగారం ధర రూ. 1,44,220 వద్ద కొనసాగుతుండగా..22క్యారెట్ల 10గ్రాముల బంగారం ధర రూ. 1,32,200వద్ద నిలిచింది. కిలో వెండి ధర సైతం రూ.2,35,000వద్ద కొనసాగుతుంది.

అంతర్జాతీయ భౌగోళిక, ఆర్థిక పరిణామాలతో బంగారం, వెండి ధరలు ప్రభావితం అవుతున్నాయి. సోమవారం బులియన్ మార్కెట్ లో బంగారం, వెండి ధరలు వరుసగా రెండో రోజు కూడా స్థిరంగా నిలిచాయి. 24క్యారెట్ల 10గ్రాముల బంగారం ధర రూ. 1,44,220 వద్ద కొనసాగుతుండగా..22క్యారెట్ల 10గ్రాముల బంగారం ధర రూ. 1,32,200వద్ద నిలిచింది. కిలో వెండి ధర సైతం రూ.2,35,000వద్ద కొనసాగుతుంది.

ప్రస్తుత ధరలు బంగారం, వెండి కొనుగోలుకు అనుకూలంగా పరిగణించవచ్చని మార్కెట్ నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ఆగస్టు నెలలో సైతం బంగారం హెచ్చతగ్గులకు అవకాశం ఉందని, అయితే 2నుంచి 5శాతం లోపునే ధరలలో మార్పులు ఉండవచ్చని అంచనా వేస్తున్నారు. పశ్చిమాసియా సంక్షోభం, ద్రవ్యోల్బణం, అమెరికా డాలర్ విలువ, కేంద్ర బ్యాంకుల పసిడి కొనుగోలు, ఫెడర్ రిజర్వ్ బ్యాంకు వడ్డీ రేట్లు వంటి పరిణామాలు బంగారం, వెండి వంటి విలువైన లోహాల ధరలను ప్రభావితం చేస్తున్నందునా…ధరలలో అస్థిరత కొనసాగనుందని నిపుణులు చెబుతున్నారు. కొనుగోలుదారులు మార్కెట్ పరిస్థితులను గమనిస్తూ కొద్దికొద్దిగా కొనుగోలు  చేసుకోవడం మంచిదని సూచిస్తున్నారు.

Latest News