ఫ్రెండ్‌షిప్ డే వేళ విషాదం..వైజాగ్ బీచ్‌లో ఇద్దరు గల్లంతు

విశాఖపట్నం పెదగంట్యాల మండలం పాత గంగవరం బీచ్‌లో ఫ్రెండ్‌షిప్ డే వేడుకల్లో విషాదం చోటుచేసుకుంది. బీచ్ లో ఫోటోలు దిగుతుండగా అలల తాకిడికి స్నేహితులైన యువతి, యువకుడు గల్లంతయ్యారు.

Reported by: Y.V. Narsimha Reddy | ఆంధ్ర ప్రదేశ్ | Aug 02, 2026, 1:51 pm IST
Read Time: 3 mins
ఫ్రెండ్‌షిప్ డే వేళ విషాదం..వైజాగ్ బీచ్‌లో ఇద్దరు గల్లంతు

అమరావతి : విశాఖపట్నం పెదగంట్యాల మండలం పాత గంగవరం బీచ్‌లో ఫ్రెండ్‌షిప్ డే వేడుకల్లో విషాదం చోటుచేసుకుంది. బీచ్ లో ఫోటోలు దిగుతుండగా అలల తాకిడికి స్నేహితులైన యువతి, యువకుడు గల్లంతయ్యారు.  ఫ్రెండ్‌షిప్ డే వేడుకల సందర్భంగా పలువురు స్నేహితులు వైజాగ్ బీచ్ వద్ద సరదాగా గడిపేందుకు వెళ్లారు.

బీచ్ వద్ద ఒక రాయిపై నిల్చొని ఫోటోలు దిగుతున్న సమయంలో ఒక్కసారిగా ఓ పెద్ద అల వారిపైకి దూసుకొచ్చింది. ఆ భారీ అల స్నేహితుల బృందంలోని నీతును సముద్రంలోకి లాక్కెళ్లింది. నీతును కాపాడేందుకు ప్రయత్నించిన రాము సైతం సముద్రంలో గల్లంతయ్యాడు.

సమాచారం అందుకున్న పోలీసులు, సహాయక బృందం వెంటనే రంగంలోకి దిగింది. గల్లంతైన వారి కోసం గాలింపు చర్యలు చేపట్టారు. గల్లంతైన ఇద్దరు పెదజాలరిపేటకు చెందిన నీతు, రాములుగా గుర్తించారు.