హైదరాబాద్ : అమెరికా – ఇరాన్ మధ్య జరిగిన శాంతి చర్చలు ఫలించకపోవడం… దానికి తోడు హార్ముజ్ జలసంధిని దిగ్బంధానికి అమెరికా పూనుకోవడంతో అంతర్జాతీయ మార్కెట్లో బంగారం ధరలు ఒడిదుడుకులకు లోనవుతున్నాయి. ప్రపంచ వ్యాప్తంగా నెలకొన్న ఆర్థిక, రాజకీయ పరిణామాల నేపథ్యంలో బంగారం, వెండి ధరలు కాస్తా పంజుకున్నాయి. మంగళవారం బులియన్ మార్కెట్ లో 24క్యారెట్ల 10గ్రాముల బంగారం ధర రూ. 1,470 పెరిగి, రూ. 1,53,930వద్ద కొనసాగుతుంది. 22క్యారెట్ల 10గ్రాముల బంగారం ధర 1,350 పెరిగి రూ. రూ. 1,41,100 వద్ద నిలిచింది. కిలో వెండి ధర రూ. 5,000పెరిగి రూ. 2,65,000కు చేరింది.
కొనసాగుతున్న అనిశ్చితి
సెంట్రల్ బ్యాంకులు డాలర్ కాకుండా బంగారాన్ని నిల్వ చేసుకోవడం, పెరుగుతున్న ద్రవ్యలోటు, భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు బంగారం, వెండి ధరలలో అనిశ్చితి కొనసాగింపుకు కారణం అవుతున్నాయి. చమురు ధరలు పెరగడం వల్ల ద్రవ్యోల్బణం పెరిగి, అది వడ్డీ రేట్ల ద్వారా బంగారం ధరలపై ఒత్తిడి తీసుకురావచ్చని కూడా నిపుణులు హెచ్చరిస్తున్నారు. బంగారం ధరలు తిరిగి 5 వేల డాలర్ల మార్కును దాటాలంటే చమురు ధరలు బ్యారెల్‌కు 80-85 డాలర్ల స్థాయికి తగ్గాలని ‘స్టేట్ స్ట్రీట్’ నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ప్రస్తుత మార్కెట్ పరిస్థితిని విశ్లేషిస్తే, నాలుగు అంశాలు బంగారం ధరలను ప్రభావితం చేస్తున్నాయి. మొదటిది.. వివిధ దేశాల సెంట్రల్ బ్యాంకులు సుమారు 800 టన్నుల బంగారాన్ని కొనుగోలు చేసే అవకాశం ఉంది. రెండవది.. ఏప్రిల్ నెలలో గోల్డ్ ఈటీఎఫ్ (ETF) హోల్డింగ్‌లు పెరగడం. మూడవది.. పెరుగుతున్న సార్వభౌమ రుణాల ఆందోళనలు. నాలుగవది.. హార్ముజ్ జలసంధిలో నెలకొన్న ఉద్రిక్తతలు. యూబీఎస్ (UBS) వంటి సంస్థలు సంవత్సరాంతానికి 5,600 డాలర్ల లక్ష్యాన్ని నిర్దేశిస్తున్నప్పటికీ ప్రస్తుతానికి మాత్రం ధరల అనిశ్చితి కొనసాగుతుంది.
ఇవి కూడా చదవండి :
Sun’s Transit into Aries | నేడు మేష రాశిలోకి సూర్య సంచారం.. ఈ రాశి వారికి వాహన గండం..! జర జాగ్రత్త..!!
Sun’s Transit into Aries | నేడు మేష రాశిలోకి సూర్య సంచారం.. ఈ రాశి వారికి వాహన గండం..! జర జాగ్రత్త..!!
