స్థిరంగా బంగారం, వెండి ధరలు

ఆదివారం బులియన్ మార్కెట్ లో 24క్యారెట్ల 10గ్రాముల బంగారం ధర రూ. 1,58,240 వద్ద కొనసాగుతుండగా, 22క్యారెట్ల 10గ్రాముల బంగారం ధర రూ. 1,45,050వద్ద కొనసాగుతుంది. కిలో వెండి ధర రూ. 2,60,000వద్ద నిలకడగా ఉంది. సెప్టెంబర్ మాసంలో పసిడి ధరలు ఎలా ఉంటాయన్నదానిపై ఆసక్తి నెలకొంది.

విధాత, హైదరాబాద్ : అంతర్జాతీయ భౌగోళిక, ఆర్థిక పరిణామాల క్రమంలో కొన్ని నెలలుగా తీవ్ర హెచ్చుతగ్గులకు గురైన బంగారం, వెండి ధరలు ఆగస్టు మాసంలో పుంజుకుని..చివరి వారంతో మళ్లీ పడిపోయాయి. మూడు రోజులుగా తగ్గుముఖం పట్టిన బంగారం, వెండి ధరలు ఆదివారం స్థిరంగా కొనసాగుతున్నాయి. 24క్యారెట్ల 10గ్రాముల బంగారం ధర రూ. 1,58,240 వద్ద కొనసాగుతుండగా, 22క్యారెట్ల 10గ్రాముల బంగారం ధర రూ. 1,45,050వద్ద కొనసాగుతుంది. కిలో వెండి ధర రూ. 2,60,000వద్ద నిలకడగా ఉంది.

సెప్టెంబర్ మాసం ధరలపై అంచనాలు

అంతర్జాతీయ మార్కెట్లలో చోటుచేసుకుంటున్న పరిణామాలు, అమెరికా ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్లపై తీసుకునే నిర్ణయాలు, డాలర్ విలువ, భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు వంటి అంశాలపై బంగారం ధరలు ఆధారపడుతున్నాయి. అయితే ఆగస్ట్ లో భారీగా పెరిగిన పసిడి ధరలు సెప్టెంబర్ లో ఎలా ఉండబోతున్నాయన్నది ఆసక్తిగా మారింది. సాధారణంగా ఒక నెల పుత్తడి ధరలు భారీగా పెరిగితే, తరువాతి నెలలో తగ్గుదల ఉంటుంది.సెప్టెంబర్‌లో బంగారం ధరలు హెచ్చుతగ్గుల మధ్య కొనసాగే అవకాశం ఉందని నిపుణులు అంచనా వేస్తున్నారు.

బంగారం కొనుగోలు చేయాలనుకునే వారి ఒకేసారి పెద్ద మొత్తంలో కొనుగోలు చేయకుండా.. క్రమ క్రమంగా కొనుగోలు చేస్తే మంచిదని పేర్కొంటున్నారు.సెప్టెంబర్‌లో బంగారం ధరలకు పూర్తిగా క్షీణించే పరిస్థితి కంటే, హెచ్చుతగ్గులతో కూడిన బలమైన మార్కెట్ ఉండే అవకాశమే ఎక్కువగా కనిపిస్తోందని అంచనా వేస్తున్నారు.

బంగారానికి దీర్ఘకాలంలో అనుకూల పరిస్థితులు కొనసాగుతున్నాయని పేర్కొంటున్నారు. కేంద్ర బ్యాంకుల కొనుగోళ్లు, ప్రపంచ ఆర్థిక అనిశ్చితి, భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు పసిడికి మద్దతుగా నిలిచే అవకాశం ఉందని వివరిస్తున్నారు. 2026 చివరి నాటికి అంతర్జాతీయంగా బంగారం ధర మరింత పెరిగే అవకాశాన్ని పలు నివేదికలు పేర్కొంటున్నాయి.

Latest News