స్థిరంగా బంగారం, వెండి ధరలు
శనివారం బులియన్ మార్కెట్ లో 24క్యారెట్ల 10గ్రాముల బంగారం ధర రూ.1,50,930 వద్ద స్థిరంగా నిలిచింది. 22క్యారెట్ల 10గ్రాముల బంగారం ధర రూ. 1,38,350 వద్ద నిలిచింది. కిలో వెండి ధర సైతం రూ.2,55,000వద్ద కొనసాగుతుంది.
విధాత, హైదరాబాద్ : అంతర్జాతీయంగా ప్రస్తుతం నెలకొన్న భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు, ఆర్థిక అనిశ్చితి నేపథ్యంలో.. బంగారం, వెండి ధరలు వరుస హెచ్చుతగ్గులకు గురవుతున్నాయి. శనివారం బులియన్ మార్కెట్ లో 24క్యారెట్ల 10గ్రాముల బంగారం ధర రూ.1,50,930 వద్ద స్థిరంగా నిలిచింది. 22క్యారెట్ల 10గ్రాముల బంగారం ధర రూ. 1,38,350 వద్ద నిలిచింది. కిలో వెండి ధర సైతం రూ.2,55,000వద్ద కొనసాగుతుంది.
పెరుగుదల ఖాయం
మార్చి నెలలో బంగారం ధరలు హెచ్చు తగ్గుల మధ్య భారీ పతనాన్ని నమోదు చేశారు. ఫిబ్రవరి చివరిలో ఇరాన్ సంఘర్షణ ప్రారంభమైనప్పటి నుండి మార్చిలో పసిడి ధరలు 11 శాతం క్షీణించాయి. అయితే మార్చి 23న నమోదైన కనిష్ట స్థాయిల నుండి ధరలు అనూహ్యంగా పుంజుకున్నాయి. కేవలం ఒక వారంలోనే 15 శాతం మేర వృద్ధి చెంది, అంతర్జాతీయ మార్కెట్‌లో ఔన్సుకు 4,700 డాలర్ల మార్కును దాటాయి. ఈ పరిణామాల మేరకు ఇదే ఏప్రిల్ నెలలో బంగారం ధరలు ఆల్ టైమ్ రికార్డుకు చేరవచ్చని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ఔన్స్ ధర రూ. 5,500డాలర్లు నుంచి 6వే వరకు వెళ్లవచ్చని అంచనా వేస్తున్నారు.
ఇవి కూడా చదవండి :
Rashmika | పెళ్లి తర్వాత గ్లోబల్ స్టేజ్‌పై మెరవనున్న రష్మిక మందన్నా… క్రంచీరోల్ అవార్డ్స్‌లో అరుదైన ఘనత
Suicide | ఓయో రూమ్‌లో పెళ్లి బట్టల్లోనే ఉరేసుకున్న యువకుడు
X
Google News
Facebook
Instagram
Youtube
Telegram