Gold Rates | పసిడి ప్రియులకు శుభవార్త.. తులం బంగారం రూ. 89 వేలే..!
Gold Rates | పసిడి ప్రియులకు శుభవార్త.. గత రెండు, మూడు రోజుల నుంచి బంగారం ధరలు( Gold Rates ) క్రమంగా తగ్గుతూ వస్తున్నాయి.
Gold Rates | హైదరాబాద్ : పసిడి ప్రియులకు శుభవార్త.. గత రెండు, మూడు రోజుల నుంచి బంగారం ధరలు( Gold Rates ) క్రమంగా తగ్గుతూ వస్తున్నాయి. గోల్డ్ ధరలు కాస్త తగ్గడంతో మగువలు ఊపిరి పీల్చుకుంటున్నారు. 90 వేలకు పైగా ఎగబాకిన గోల్డ్ ధరలు.. 89 వేల దాకా చేరుకున్నాయి. బంగారం ధరలు క్రమంగా తగ్గుతుండడంతో.. గోల్డ్ కొనేందుకు ఆసక్తి చూపుతున్నారు. గత రెండు రోజుల నుంచి చూస్తే బంగారం షాపుల వద్ద రద్దీ కనబడుతోంది. అయితే ఉగాదికి ఒకట్రెండు రోజులు అటుఇటు.. తులం బంగారం ధర రూ. లక్ష అయ్యే అవకాశం ఉందని మార్కెట్ నిపుణులు అంచనా వేస్తున్నారు. కాబట్టి ఇప్పుడే బంగారం కొనడం మంచిదని సూచిస్తున్నారు.
మార్చి 25వ తేదీన హైదరాబాద్ మార్కెట్‌లో 22 క్యారెట్ల బంగారం ధర రూ. 82,140 కాగా, 24 క్యారెట్ల బంగారంం ధర రూ. 89,610. ఇక 18 క్యారెట్ల బంగారం ధర రూ. 67,210గా పలుకుతోంది. కిలో వెండి ధర రూ. 1,09,900గా ఉంది. 10 గ్రాముల ప్లాటినం ధర రూ. 27,040గా ఉంది. ఇక ఆంధ్రప్రదేశ్‌లోని విజయవాడ, విశాఖపట్టణంతో పాటు కర్ణాటక రాజధాని బెంగళూరు నగరంలోనూ ఇదే ధరలు కొనసాగుతున్నాయి. దేశ రాజధాని ఢిల్లీలో 22 క్యారెట్ల బంగారం ధర రూ. 82,290, 24 క్యారెట్ల బంగారం ధర రూ. 89,760గా కొనసాగుతోంది.
X
Google News
Facebook
Instagram
Youtube
Telegram