Home loan protection policy | హౌజింగ్ లోన్‌తో పాటు ఇన్సూరెన్స్ తీసుకోవాలి
ఇల్లు లేదా ఫ్లాట్ కొనుగోలు చేసిన సమయంలో దాని ప్రొటెక్షన్ పాలసీ కూడా తీసుకుంటే మంచిదని నిపుణులు సూచిస్తున్నారు.

Home loan protection policy | హౌజింగ్ లోన్ తీసుకున్న సమయంలో ఇన్సూరెన్స్ పాలసీ కూడా తీసుకోవాలని బ్యాంకర్లు కోరుతారు. రుణ గ్రహీత ఏదేని పరిస్థితుల్లో లోన్ చెల్లించలేని పరిస్థితులు ఏర్పడితే ఇన్సూరెన్స్ నుంచి లోన్ ను రికవరీ చేసుకొనే వెసులుబాటు ఉంటుంది. అందుకే లోన్లు ఇచ్చే సమయంలోనే బ్యాంకులు లోన్ కవర్ టర్మ్ పాలసీలను తీసుకొనేలా రుణగ్రహీతలపై ఒత్తిడి తెస్తున్నాయి.
లోన్ తో పాటు పాలసీ ఎందుకు?
హౌజింగ్ లోన్ తీసుకునే సమయంలో హోమ్ లోన్ ప్రొటెక్షన్ పాలసీలు ( లోన్ కవర్ టర్మ్ పాలసీ) తీసుకోవాలని బ్యాంకులు రుణ గ్రహీతలకు సూచిస్తున్నాయి. హౌజింగ్ లోన్ ఎంత కాలం ఈఎంఐ కడతారో అంత కాలానికి ఈ పాలసీలు టర్మ్ ఉంటుంది. లోన్ పూర్తైతే సాధారణ ఇన్సూరెన్స్ పాలసీ మాదిరిగా వర్తిస్తుంది. లోన్ పూర్తయ్యేలోపుగా రుణ గ్రహీతకు ఏదైనా ఇబ్బంది జరిగి రుణం చెల్లించలేని పరిస్థితులు ఏర్పడితే ఇన్సూరెన్స్ క్లైయిమ్ చేసుకోవచ్చు. ఏదైనా వైకల్యం ఏర్పడితే ఈఎంఐలు ఇన్సూరెన్స్ నుంచి తీసుకోవచ్చు. రుణ గ్రహీత మరణిస్తే పరిహారం కూడా చెల్లిస్తాయి. తీవ్రవ్యాధుల బారిన పడిన సమయంలో రుణాలు చెల్లించేలా, ఉద్యోగం కోల్పోయిన సందర్భాల్లో ఇలా తీసుకొనే పాలసీల ఆధారంగానే పరిహారం చెల్లిస్తాయి భీమా కంపెనీలు. అందుకే పాలసీ ఎంపిక చేసుకొనే సమయంలో అన్ని ఆలోచించి నిర్ణయాలు తీసుకోవాలి.
ఈఎంఐ ద్వారా చెల్లింపు
- లోన్లు మంజూరు చేసే బ్యాంకులే ఈ రకమైన పాలసీలను కూడా ఇస్తున్నాయి.
- బ్యాంకుల నుంచి కాకుండా బయట కూడా ఈ తరహా పాలసీలను తీసుకోవచ్చు.
- లోన్ విలువ తగ్గుతుంటే పాలసీ విలువ కూడా తగ్గుతుంది. దీన్ని రెడ్యూసింగ్ అంటారు.
- ఇక లెవల్ కవర్ పాలసీ అని మరోటి ఉంటుంది. అది పాలసీ విలువను తగ్గించదు.
- రుణ గ్రహీత వయస్సు, భీమా మొత్తం, ఆరోగ్య వివరాల ఆధారంగా ఇన్సూరెన్స్ పాలసీ ఇస్తారు.
- ఈ పాలసీ ప్రీమియం చెల్లింపును లోన్ తో కలిపి కూడా చేసుకోవచ్చు.
- మీరు తీసుకున్న లోన్ రూ.20 లక్షలు.. ఇన్సూరెన్స్ ప్రీమియం వన్ టైమ్ కింద రూ.2 లక్షలు పే చేయాలి.
- మొత్తం కలిపి రూ.22 లక్షలు దీన్ని ఈఎంఐ కింద చెల్లిస్తారు.
- అంటే రుణంతో పాటు పాలసీ ప్రీమియం కూడా ఈఎంఐ కింద కడుతున్నారు.
పన్ను మినహాయింపులు
హౌజింగ్ లోన్ కవర్ చేసేందుకు తీసుకున్న టర్మ్ పాలసీల కోసం ఖర్చు చేసే డబ్బులను ఆదాయ పన్ను చట్టం చూపేందుకు అవకాశం ఉంది. 1961 ఆదాయపన్ను చట్టం 80 సీ సెక్షన్ మినహాయింపులను పొందవచ్చు. ప్రీమియం డబ్బును కూడా అప్పుగా తీసుకొని నెల నెలకు ఈఎంఐ కింద చెల్లిస్తే ఈ పన్ను మినహాయింపు పొందలేరు. ఒక బ్యాంకు నుంచి మరో బ్యాంకు లోన్ ను మార్చుకున్న సమయంలో ఫస్ట్ బ్యాంకులో తీసుకున్న ఇన్సూరెన్స్ పాలసీ రద్దు అవుతుంది. కొత్త బ్యాంకుకు లోన్ మార్చుకుంటే కొత్త పాలసీ తీసుకోవాల్సిందే.