Personal Loan Vs Mortgage Loan | పర్సనల్ లోన్, తాకట్టు రుణం: మీ అవసరాలకు సరైన రుణాన్ని ఎలా ఎంచుకోవాలి?
పర్సనల్ లోన్, తాకట్టు రుణం మధ్య తేడా ఏమిటి? మీ అవసరాలకు సరైన రుణాన్ని ఎంచుకోవడానికి తెలుసుకోవాల్సిన ముఖ్యమైన సూచనలు ఇక్కడ చూడండి.
వ్యక్తిగత రుణం అనేది ఒక అన్‌సెక్యూర్డ్ రుణం. దీనిని మీరు ఏ అవసరాలకైనా ఉపయోగించవచ్చు. వైద్య ఖర్చు, విదేశీ ప్రయాణాలు వంటి అవసరాల కోసం వ్యక్తిగత రుణం తీసుకోవచ్చు. మీ క్రెడిట్ స్కోర్, ఆదాయ వివరాల ఆధారంగా మీకు పర్సనల్ లోన్ ను ఆయా బ్యాంకులు, ఆర్ధిక సంస్థలు మంజూరు చేస్తాయి. ఇక ఇంటి నిర్మాణం,నిర్మాణంలో ఉన్న ఇల్లు కొనుగోలు, నిర్మించిన ఇంటి కొనుగోలు కోసం బ్యాంకులు రుణాలు ఇస్తాయి. దీన్ని హౌసింగ్ లోన్ అంటారు. అంటే నిర్మాణంలో ఉన్న లేదా సిద్దంగా ఉన్న ఆస్తిని పూచీకత్తుగా తాకట్టు పెట్టి తీసుకొనే రుణం. ఆస్తి విలువ, మీ ఆదాయం, క్రెడిట్ ప్రొఫైల్ ఆధారంగా బ్యాంకులు లేదా ఆర్ధిక సంస్థలు మీకు రుణం మంజూరు చేస్తాయి.
పర్సనల్ లోన్ ఎప్పుడు తీసుకోవాలి?
పర్సనల్ లోన్ ఎప్పుడు తీసుకోవాలో ముందు తెలుసుకోవాలి. మీ అవససరం ఎలాంటిది? చిన్న అవసరమా? పెద్ద అవసరమా? మీకు ఎంత నగదు అవసరం? మీకు అవసరమైన డబ్బుకు ఆస్తులు తాకట్టు పెట్టకున్నా రుణం మంజూరయ్యే అవకాశం ఉందా? అనే విషయాలపై ఆలోచించాలి. మీ ఆర్ధిక అవసరాలను దృష్టిలో ఉంచుకొని పర్సనల్ లోన్ కు వెళ్లాలా? వేరే లోన్ తీసుకోవాలో నిర్ణయించుకోవాలి? చిన్న చిన్న అవసరాలకు పర్సనల్ లోన్ తీసుకోవడం ఉత్తమం. తక్కువ రుణం, తక్కువ కాలపరిమితి అయితే పర్సనల్ లోన్ తీసుకోవచ్చు. పర్సనల్ లోన్ వెంటనే మంజూరు అవుతుంది. ఎక్కువ డాక్యుమెంట్లు కూడా అవసరం ఉండదు. పర్సనల్ లోన్ తీసుకుంటే ఆ నిధులను మీరు దేని కోసమైనా వాడుకోవచ్చు.
ఆస్తి తాకట్టు రుణాలు ఎప్పుడు తీసుకోవాలి?
మీరు ఏదైనా ఇల్లు లేదా ఆస్తి కొనుగోలు చేసే సమసయంలో లేదా ఇల్లు నిర్మిస్తే… ఇప్పటికే ఉన్న ఇంటికి రిపేర్ లేదా మరో అంతస్తు నిర్మాణానికి తాకట్టు పెట్టి రుణం తీసుకోవడం సరైన నిర్ణయంగా నిపుణులు చెబుతున్నారు. సాధారణంగా ఈ రుణాలు ఎక్కువ మొత్తంలో ఉంటాయి. అంతేకాదు వీటి కాల వ్యవధి కూడా ఎక్కువే. రుణం సురక్షితంగా ఉన్నందుదన వడ్డీరేట్లు సాధారణంగా అన్ సెక్యూర్డ్ క్రెడిట్ కంటే తక్కువగా ఉంటాయి. ఆస్తులు తాకట్టు పెట్టి రుణం తీసుకొనే సమయంలో మీ అవసరాలను గుర్తుంచుకోవాలి.
పర్సనల్ లోన్‌కు వడ్డీరేటు ఎందుకు ఎక్కువ?
పర్సనల్ లోన్ కు వడ్డీరేటు ఎక్కువ. ఈ రుణాలు అన్ సెక్యూర్డ్ రుణాలుగా పిలుస్తారు. అందుకే ఈ లోన్లకు వడ్డీరేటు కూడా ఎక్కువే. ఇక ఆస్తులు తాకట్టు పెట్టి తీసుకున్న రుణాలకు వడ్డీ తక్కువగా ఉంటుంది. ఆస్తి తాకట్టు పెట్టిన రుణాలను సురక్షితమైన రుణాలుగా భావిస్తారు. రుణం తీసుకున్న వ్యక్తి ఒకవేళ రుణం చెల్లించకపోయినా తాకట్టు పెట్టిన ఆస్తిని విక్రయించి తాము ఇచ్చిన రుణాన్ని బ్యాంకులు లేదా ఆర్ధిక సంస్థలు తీసుకుంటాయి. అంతేకాదు ఆదాయపన్ను చట్టంలో తాకట్టు పెట్టిన ఆస్తుల చెల్లింపులో ఏడాదికి కనీసం లక్షన్నర వరకు పన్ను మినహాయింపు పొందే వెసులుబాటు కూడా ఉంది. పర్సనల్ లోన్ కోసం మీ ఆస్తులను తాకట్టు పెట్టే అవసరం ఉండదు. దీంతో మీకు ఇష్టమైన ఇల్లు, కార్ల వంటివి కోల్పోయే అవకాశం ఉండదు. కానీ, అధిక వడ్డీరేట్లు ఆర్ధికంగా ఇబ్బంది కల్గించే అవకాశం ఉంటుంది. ఒక ఆస్తులు తాకట్టు పెట్టి తీసుకొన్న రుణం చెల్లించకపోతే తాకట్టు పెట్టిన ఆస్తులు కోల్పోయే అవకాశం ఉంది. ఒకవేళ మీరు లోన్ చెల్లించని పరిస్థితి ఏర్పడితే అది మీ క్రెడిట్ హిస్టరీపై పడే అవకాశం ఉంది.
కాలపరిమితి ఎంత?
పర్సనల్ లోన్ కాల పరిమితి ఏడాది నుంచి ఐదేళ్ల వరకు ఉంటాయి. ఇక ఆస్తులు తాకట్టు పెట్టి తీసుకొనే రుణాలు 10 నుంచి 30 ఏళ్ల వరకు ఉంటాయి. పర్సనల్ లోన్ వడ్డీరేటు ఎక్కువ. అందుకే ఈ రుణాన్ని త్వరగా తీర్చేందుకు ఎక్కువ మంది తీర్చాలని భావిస్తారు. తాకట్టు పెట్టి తీసుకున్న రుణాలకు ఈఎంఐలు సక్రమంగా చెల్లిస్తే సరిపోతుంది. అయితే అందరికీ ఒకే రకమైన అవసరాలు ఉండవు. అందరికీ ఒకే రకమైన రుణాలు అవసరం లేదు. వారి వారి అవసరాల ఆధారంగా పర్సనల్ లోన్ లేదా ఆస్తులు తాకట్టు పెట్టి రుణాలు తీసుకుంటారు.
X
Google News
Facebook
Instagram
Youtube
Telegram