Pure: బ్యాటరీ ఆధారిత పవర్ గ్రిడ్ ఆవిష్కరణ

ఢిల్లీ: విద్యుత్ స్టోరేజీ, టూవీలర్ ఈ-మొబిలిటీ రంగాలకు చెందిన ప్యూర్ సంస్థ, ఢిల్లీలో 5 MWh బ్యాటరీ ఆధారిత ప్యూర్‌పవర్ గ్రిడ్ (PuREPower Grid) ఉత్పత్తిని ఆవిష్కరించింది. భారతదేశ విద్యుత్ మౌలిక సదుపాయాలను సంస్కరించేందుకు, గ్రిడ్ స్థిరత్వాన్ని బలోపేతం చేసేందుకు, పునరుత్పాదక ఇంధన వనరుల సమగ్రతను వేగవంతం చేసేందుకు ఈ వినూత్న ఉత్పత్తి దోహదపడనుంది. సోలార్, పీసీఎస్‌తో కూడిన 5 MWh కంటైనరైజ్డ్ ఉత్పత్తిగా రూపొందిన ప్యూర్‌పవర్ గ్రిడ్, పరిశ్రమలో గణనీయ ఆదరణ పొందింది. 10కి పైగా ప్రముఖ రెన్యూవబుల్ ఎనర్జీ ఈపీసీ సంస్థలు, భారీ పరిశ్రమల నుంచి ఆసక్తి వ్యక్తీకరణ పత్రాలు (ఈవోఐ) అందాయి. 2030 నాటికి 500 GW పునరుత్పాదక విద్యుత్ సామర్థ్యం సాధించాలన్న భారత లక్ష్యంతో, 200 GWh బ్యాటరీ ఎనర్జీ స్టోరేజీ సిస్టమ్ (బీఈఎస్ఎస్) అవసరం నెలకొన్న నేపథ్యంలో, ఈ మార్కెట్ ఈ దశాబ్దం చివరి నాటికి 36 బిలియన్ డాలర్లకు చేరుతుందని అంచనా.
యమేకిన్ ఇండియా అనుభవం, అధునాతన టెక్నాలజీతో ప్యూర్, తక్కువ ధరలో గ్రిడ్-స్కేల్ ఉత్పత్తిని అందిస్తోంది. అత్యధిక విద్యుత్ సాంద్రత గల బ్యాటరీలు, 5వ తరం పవర్ ఎలక్ట్రానిక్స్‌తో నిర్మితమైన ఈ ఉత్పత్తి, క్లౌడ్, ప్రెడిక్టివ్ ఏఐతో 100% అప్‌టైమ్, తక్కువ అవాంతరాలు, గరిష్ట నిర్వహణ సామర్థ్యాలను అందిస్తుంది. నానో-పీసీఎం, లిక్విడ్ కూలింగ్ సామర్థ్యాలతో కూడిన మల్టీ-లెవెల్ థర్మల్ మేనేజ్‌మెంట్ సిస్టమ్, శక్తి వృధాను నివారిస్తూ, జీవితకాలాన్ని పెంచుతూ, రౌండ్ ట్రిప్ సామర్థ్యాన్ని మెరుగుపరుస్తుంది. ఈ అంశంపై డా.నిశాంత్ దొంగారి మాట్లాడుతూ… “ప్యూర్‌పవర్ గ్రిడ్ కేవలం ఉత్పత్తి కాదు, భారత ఇంధన పరివర్తనకు ఉత్ప్రేరకం. బ్యాటరీ టెక్నాలజీ, పవర్ ఎలక్ట్రానిక్స్‌లో మా అనుభవంతో శక్తిమంతమైన, తెలివైన, తక్కువ ధర ఉత్పత్తిని రూపొందించాం. గ్రిడ్ స్థిరత్వం, రెన్యూవబుల్ ఇంధన సమగ్రత, ఈవీ ఫాస్ట్ చార్జర్ల వినియోగాన్ని పెంచడంలో ఇది కీలక పాత్ర పోషిస్తుంది,” అని తెలిపారు.