Jio Bharat 1 5G | భారత మార్కెట్‌లోకి త్వరలో జియో 5జీ స్మార్ట్‌ ఫోన్‌.. ధర కేవలం రూ.5,999..!

Jio Bharat 1 5G | స్మార్ట్‌ఫోన్ మార్కెట్‌లో గత కొంతకాలంగా 5జీ స్మార్ట్‌ఫోన్‌ల హవా నడుస్తోంది. ఈ విభాగంలో కొత్త మొబైల్స్‌ తీసుకొచ్చేందుకు టెక్ కంపెనీలు తీవ్రంగా పోటీ పడుతున్నాయి. ఇప్పుడు టెలికాం దిగ్గజం జియో కూడా ఈ పోటీలోకి వచ్చింది. స్మార్ట్‌ఫోన్ మార్కెట్‌లో తనదైన ముద్ర వేయడానికి బడ్జెట్ ఫోన్‌తో సిద్ధంగా ఉంది.

Jio Bharat 1 5G | భారత మార్కెట్‌లోకి త్వరలో జియో 5జీ స్మార్ట్‌ ఫోన్‌.. ధర కేవలం రూ.5,999..!

Jio Bharat 1 5G : స్మార్ట్‌ఫోన్ మార్కెట్‌లో గత కొంతకాలంగా 5జీ స్మార్ట్‌ఫోన్‌ల హవా నడుస్తోంది. ఈ విభాగంలో కొత్త మొబైల్స్‌ తీసుకొచ్చేందుకు టెక్ కంపెనీలు తీవ్రంగా పోటీ పడుతున్నాయి. ఇప్పుడు టెలికాం దిగ్గజం జియో కూడా ఈ పోటీలోకి వచ్చింది. స్మార్ట్‌ఫోన్ మార్కెట్‌లో తనదైన ముద్ర వేయడానికి బడ్జెట్ ఫోన్‌తో సిద్ధంగా ఉంది. ఈ 5జీ ఫోన్ ప్రీమియం ఫీచర్లతో రాబోతుంది. ఈ ఫోన్‌కు సంబంధించిన మరిన్ని వివరాలు తెలుసుకుందాం..

రిలయన్స్‌ జియో త్వరలో Jio Bharat 1 5G పేరుతో కొత్త స్మార్ట్‌ఫోన్‌ను పరిచయం చేయనుంది. ఈ ఫోన్‌కు సంబంధించి ధరతో సహా ఇప్పటికే కొన్ని ప్రత్యేక ఫీచర్‌లు లీకయ్యాయి. ఈ ఫీచర్లను చూస్తుంటే ఇతర స్మార్ట్‌ ఫోన్‌ కంపెనీలకు సమస్యలు ఎదురయ్యే అవకాశం ఉందనిపిస్తోంది. ఈ ఫోన్ అతి తక్కువ ధరకు అంటే కేవలం రూ.5,999కి అందుబాటులోకి వస్తున్నట్లు తెలిసింది. ఈ ఫోన్‌లో ఎక్కువ రిజల్యూషన్ కెమెరా కూడా ఉండే అవకాశం ఉంది.

ఈ కొత్త 5G స్మార్ట్‌ఫోన్ గొప్ప డిజైన్‌తో వస్తోంది. ఇది 6.7 అంగుళాల సూపర్ అమోలెడ్ డిస్‌ప్లేను కలిగి ఉంటుంది. సూపర్ అమోలెడ్ డిస్‌ప్లేలో క్లస్టర్ క్లియర్ వీడియోలను చూడవచ్చు. ఫోన్ 144Hz రిఫ్రెష్ రేట్‌కు మద్దతిస్తుంది. దీని కారణంగా మీరు సున్నితమైన టచ్ అనుభూతిని పొందుతారు.

ఫోటోగ్రఫీని ఇష్టపడే వారు ఈ ఫోన్‌తో అద్భుతమైన ఫోటోలను తీయవచ్చు. ఫోన్ 12, 32 లేదా 50MPకి బదులుగా 100MP ప్రైమరీ కెమెరా సెటప్‌తో వచ్చే అవకాశం ఉంది. అంతేగాక ఈ ఫోన్‌ను 16 మెగాపిక్సెల్ వైడ్ యాంగిల్ కెమెరాతో కూడా చూడవచ్చు. సెల్ఫీలు, వీడియో కాలింగ్ కోసం ఫోన్‌లో 32 MP ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా ఉంది. ఈ ఫోన్ 6700 mAh బ్యాటరీని కలిగి ఉంది. ఇది 120 వాట్ల సూపర్‌ఫాస్ట్ ఛార్జింగ్‌కు మద్దతిస్తుంది.

ఈ చౌకైన జియో 5G ఫోన్ మూడు వేరియంట్లలో రానుంది. ఇందులో 8GB RAM + 128GB, 12GB RAM + 256GB, 16GB RAM + 512GB వేరియంట్లు ఉన్నాయి. Jio Bharat 1 5G లాంచ్ గురించి జియో కంపెనీ అధికారికంగా ఎటువంటి సమాచారాన్ని వెల్లడించలేదు. ఈ ఏడాది చివర్లో ఈ ఫోన్ టెక్ మార్కెట్లోకి వచ్చే అవకాశం ఉంది. ఈ జియో ఫోన్‌ ధర రూ.5,999 నుంచి రూ.6999 గా ఉంటుంది.