Jio OTT Offers | యూజర్లకు రిలయన్స్ జియో గుడ్‌న్యూస్..! రూ.448 ప్రీ పెయిడ్ ప్లాన్‌పై 13 ఓటీటీ సర్వీసెస్ ఫ్రీ..!
Jio OTT Offers | ప్రముఖ ప్రైవేట్ టెలికం కంపెనీ రిలయన్స్ జియో రూ.448 ప్రీపెయిడ్ ప్లాన్‌పై కాలింగ్ ఎస్‌ఎంఎస్, డేటా ప్రయోజనాలతో పాటు 13 ఓటీటీ సేవలను సైతం ఉచితంగా అందిస్తున్నది. ప్రస్తుత కాలంలో ఓటీటీ సేవలు ప్రియంగా మారుతున్న నేపథ్యంలో రీచార్జ్‌పై ఓటీటీ సేవలను తీసుకువస్తున్నది.
Jio OTT Offers | ప్రముఖ ప్రైవేట్ టెలికం కంపెనీ రిలయన్స్ జియో రూ.448 ప్రీపెయిడ్ ప్లాన్‌పై కాలింగ్ ఎస్‌ఎంఎస్, డేటా ప్రయోజనాలతో పాటు 13 ఓటీటీ సేవలను సైతం ఉచితంగా అందిస్తున్నది. ప్రస్తుత కాలంలో ఓటీటీ సేవలు ప్రియంగా మారుతున్న నేపథ్యంలో రీచార్జ్‌పై ఓటీటీ సేవలను తీసుకువస్తున్నది. ప్రస్తుతం మార్కెట్‌లో మిగతా టెలికం సంస్థలతో పోటీని తట్టుకొని నిలబడుతూ.. ప్రస్తుతం ఉన్న యూజర్లను పాటు కొత్త కస్టమర్లను ఆకట్టుకునేందుకు జియో ఎప్పటికప్పుడు సరికొత్త ఆఫర్స్‌ని తీసుకువస్తున్నది. ఇందులో భాగంగానే రిలయన్స్ జియో రూ.448 ప్రీ పెయిడ్ ప్లాన్‌ను తీసుకువచ్చింది. 28 రోజుల వ్యాలిడిటీతో వస్తుంది. రోజుకు 2 జీబీ డేటా లభిస్తుంది.
అన్‌లిమిటెడ్ కాలింగ్, రోజుకు 100 ఎస్ఎంఎస్‌లు సైతం వస్తాయి. అదనంగా 13 ఓటీటీలు ఉచితంగా చూడవచ్చు. వాస్తవానికి ఈ ప్లాన్ కొత్తగా తీసుకువచ్చింది. టారిఫ్ ప్లాన్ పెరిగిన తర్వాత ఈ ప్లాన్‌ను పరిచయం చేసింది. రూ.175 జియో టీవీ ప్రీమియం సైతం ఉచితంగా లభించనున్నది. ఈ ప్లాన్‌లో జీ5, సోనీ లివ్, డిస్కవరీ ప్లస్, లయన్స్‌గేట్ ప్లే, కాంచా లాంబా, సన్ నెక్స్ట్, హోయ్‌చోయ్, ప్లానెట్ మరాఠీ, ఫ్యాన్‌కోడ్, చౌపల్ తదితర 13 ఓటీటీలను ఉచితంగా స్ట్రీమింగ్ కానున్నాయి. ఈ ప్లాన్ కాస్త ఖరీదైనా ఓటీటీలను పరిగణలో తీసుకుంటే ఛీపర్ ప్లాన్ అవుతుంది. జియో సినిమా ప్రీమియం సబ్‌స్క్రిప్షన్ కావాలంటే రూ.29 కొనుగోలు చేసేందుకు అవకాశం ఉంది. అదే నెట్‌ఫ్లిక్స్ ప్లాన్ కావాలంటే మాత్రం రూ.1299తో పాటు రూ.1799 ప్లాన్స్ ఉన్నాయి. ఈ రెండింటి వ్యాలిడిటీ 84 రోజులు ఉంటుంది.
X
Google News
Facebook
Instagram
Youtube
Telegram