Jio 999 Plan | రూ.999కే కొత్త ప్లాన్‌ని తీసుకొచ్చిన జియో..! అన్‌లిమిటెడ్‌ డేటా.. 15 ఓటీటీలు ఫ్రీ..!

Jio 999 Plan | ప్రముఖ ప్రైవేట్‌ టెలికం కంపెనీ రిలయన్స్‌ జియో యూజర్లకు మరో ప్లాన్‌ అందుబాటులోకి తీసుకువచ్చింది. ఈ ప్లాన్‌లో అన్‌లిమిటెడ్‌ కాలింగ్‌, అన్‌లిమిటెడ్ హై స్పీడ్ డేటాతో పాటు ఓటీటీ సేవలను సైతం అందిస్తున్నది. ఇక ప్లాన్‌ వివరాలకు వస్తే.. రిలయన్స్‌ జియో రూ.999 కొత్త ప్లాన్‌లో యూజర్లకు పరిచయం చేసింది.

Jio 999 Plan | రూ.999కే కొత్త ప్లాన్‌ని తీసుకొచ్చిన జియో..! అన్‌లిమిటెడ్‌ డేటా.. 15 ఓటీటీలు ఫ్రీ..!

Jio 999 Plan | ప్రముఖ ప్రైవేట్‌ టెలికం కంపెనీ రిలయన్స్‌ జియో యూజర్లకు మరో ప్లాన్‌ అందుబాటులోకి తీసుకువచ్చింది. ఈ ప్లాన్‌లో అన్‌లిమిటెడ్‌ కాలింగ్‌, అన్‌లిమిటెడ్ హై స్పీడ్ డేటాతో పాటు ఓటీటీ సేవలను సైతం అందిస్తున్నది. ఇక ప్లాన్‌ వివరాలకు వస్తే.. రిలయన్స్‌ జియో రూ.999 కొత్త ప్లాన్‌లో యూజర్లకు పరిచయం చేసింది. ఇది ఓ ఫైబర్‌ ప్లాన్‌. ఇందులో చాలా ప్రయోజనాలు అందనున్నాయి. వార్షిక ప్లాన్ తీసుకుంటే 30 రోజులు అదనంగా వ్యాలిడిటీ లభిస్తుంది. ఈ రూ.999 ఫైబర్ ప్లాన్ 30 రోజుల వ్యాలిడిటీతో వస్తుంది. 30 రోజులు అన్‌లిమిటెడ్ వాయిస్ కాలింగ్ ఉంటుంది. ఇంకా రోజుకు 100 ఎస్ఎంఎస్‌లను సైతం పంపుకునే వీలుంటుంది. 150 ఎంబీపీఎస్ హైస్పీడ్ అన్‌లిమిటెడ్ డేటా పొందే అవకాశం లభిస్తుంది.

అన్నింటికీ మించి ఈ ప్లాన్‌తో కలిగే బెస్ట్ బెనిఫిట్ ఓటీటీ. ఇందులో 15పైగా ఓటీటీ సేవలు ఫ్రీ వీక్షించొచ్చు. అమెజాన్ ప్రైమ్ వీడియో, జీ5, డిస్నీ ప్లస్ హాట్‌స్టార్, సోనీ లివ్, జియో సినిమా, ఆల్ట్‌ బాలాజీ, ఈరోస్ నౌ, షెమారూ మి, డోకుబే, ఎపికాన్, సన్ ఎన్ఎక్స్‌టీ, హోయ్ చోయ్, లయన్స్ గేట్ ప్లే, ఈటీవీ విన్ ఓటీటీలతో పాటు 550కుపైగా టీవీ ఛానెల్స్‌లో ఉచితంగా కంటెంట్‌ను వీక్షించొచ్చు. ఇదే ప్లాన్ ప్రయోజనాలను వార్షికంగా సైతం పొందొచ్చు. జియో ఫైబర్ 999 ప్లాన్ ఏడాదికి తీసుకుంటే రూ.11,998 చెల్లించాల్సి ఉంటుంది. అలాగే, జీఎస్టీ సైతం అదనంగా చెల్లించాల్సి ఉంటుంది. ఏడాది ప్లాన్ ఇవే ప్రయోజనాలతో పాటు అదనంగా 30 రోజులు వ్యాలిడిటీ లభిస్తుంది. అంటే 365 రోజులు కాకుండా మరో 30 రోజుల పాటు ఈ ప్లాన్‌ పని చేస్తుంది.