Jio New Plans | మరో రెండు ప్లాన్‌ని తీసుకువచ్చిన జియో.. 5జీ స్పీడ్‌తో డేటా.. 100 ఎస్‌ఎంఎస్‌లు.. ఓటీటీ సబ్‌స్క్రిప్షన్ ఫ్రీ..
Jio New Plans | దేశంలోనే అతిపెద్ద టెలికం సంస్థ జియో (Reliance Jio). ఇటీవల టారిఫ్ ధరలను పెంచిన నేపథ్యంలో యూజర్లు వీడుతుండడంతో అప్రత్తమైంది. ఈ క్రమంలో వారిని ఆకట్టుకునేందుకు ప్రయత్నం చేస్తున్నది. ఈ క్రమంలోనే కొత్త ప్లాన్ (New Recharge Plans) ను పరిచయం చేస్తున్నది.
Jio New Plans | దేశంలోనే అతిపెద్ద టెలికం సంస్థ జియో (Reliance Jio). ఇటీవల టారిఫ్ ధరలను పెంచిన నేపథ్యంలో యూజర్లు వీడుతుండడంతో అప్రత్తమైంది. ఈ క్రమంలో వారిని ఆకట్టుకునేందుకు ప్రయత్నం చేస్తున్నది. ఈ క్రమంలోనే కొత్త ప్లాన్ (New Recharge Plans) ను పరిచయం చేస్తున్నది. ఇందులో భాగంగా రెండు సరికొత్త రీఛార్జ్ ప్లాన్‌ను తీసుకువచ్చింది. ఇందులో ఒకటి రూ.1028.. మరొకటి రూ.1029. రెండు ప్లాన్స్‌కు కేవలం రూపాయి మాత్రమే తేడా ఉంటుంది. ఈ రెండు ప్లాన్స్‌లోనూ యూజర్లకు అదిరిపోయే బెనిఫిట్స్‌ను ఇస్తున్నది. రెండు ప్లాన్‌లో 84 రోజుల వ్యాలిడిటీ ఉంటుంది. అన్‌లిమిటెడ్ కాలింగ్ సౌకర్యం ఉంటుంది. వ్యాలిడిటీ ముగిసే వరకు ఫ్రీ కాలింగ్ అందుబాటులో ఉంటుంది. ఇక ప్రతిరోజూ 2జీబీ 4జీ డేటా వస్తుంది. 84 రోజులకు మొత్తం 168 జీబీ డేటా పొందుతారు.
జియో 5జీ కవరేజ్ ఉన్న ప్రాంతంలో 5జీ స్పీడ్ పొందనున్నారు. వీటితో పాటు రీచార్జ్ ప్లాన్‌లో ప్రతిరోజూ 100 ఎస్‌ఎంఎస్‌లు ఉచితం. అలాగే, స్విగ్గి వన్ లైట్ కాంప్లిమెంటరీ ఫ్రీ మెంబర్షిప్ యాక్సెస్ పొందనున్నారు. ఇంకా అదనంగా జియో టీవీ, జియో సినిమా సైతం ఫ్రీ. రూ.1029 రీఛార్జ్ ప్లాన్‌తో పాటు రూ.1029 ప్లాన్‌లోనూ యూజర్లు అందరూ అవే బెనిఫిట్స్ ఉంటాయి. ఇందులో పెద్దగా ఎలాంటి తేడాలు ఉండవు. అన్‌లిమిటెడ్ కాలింగ్ సర్వీస్, 2జీబీ 4జీ స్పీడ్, 5జీ నెట్‌వర్క్ ఉన్న ప్రాంతాల్లో 5జీ స్పీడ్ వస్తుంది. అదనంగా యూజర్లందరూ మూడు నెలల పాటు ఉచిత అమెజాన్ ఫ్రీ మెంబర్‌షిప్‌తో పాటు జియో టీవీ, జియో సినిమా, జియో క్లౌడ్ సర్వీస్ యాక్సెస్ లభిస్తుంది. అయితే, ఎక్కువగా డేటాతో పాటు ఓటీటీ సబ్‌స్క్రిప్షన్స్ తీసుకునే వారికి ఈ ప్లాన్స్ ఎంతో ఉపయోగకరంగా ఉండనున్నాయి.
X
Google News
Facebook
Instagram
Youtube
Telegram