Jio broadband | ఏకంగా 15 ఓటీటీలతో జియో బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్.. ధర కేవలం రూ.888 మాత్రమే
Jio broadband | జియో సంస్థ తక్కువ ధరకే సరికొత్త బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్‌ను తీసుకొచ్చింది. నెట్‌ఫ్లిక్స్, అమెజాన్ ప్రైమ్ లైట్, డిస్నీ+ హాట్‌స్టార్ లాంటి 15 ఓటీటీ యాప్‌ల ప్రాథమిక సబ్‌స్క్రిప్షన్‌తోపాటు 30 ఎమ్‌బీపీఎస్ బ్రాడ్‌బ్యాండ్‌ను నెలకు రూ.888 కే అందించే ఒక కొత్త పథకాన్ని జియో ప్రకటించింది.
Jio broadband : జియో సంస్థ తక్కువ ధరకే సరికొత్త బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్‌ను తీసుకొచ్చింది. నెట్‌ఫ్లిక్స్, అమెజాన్ ప్రైమ్ లైట్, డిస్నీ+ హాట్‌స్టార్ లాంటి 15 ఓటీటీ యాప్‌ల ప్రాథమిక సబ్‌స్క్రిప్షన్‌తోపాటు 30 ఎమ్‌బీపీఎస్ బ్రాడ్‌బ్యాండ్‌ను నెలకు రూ.888 కే అందించే ఒక కొత్త పథకాన్ని జియో ప్రకటించింది. అంతకు ముందు జియోఫైబర్ రూ.1499 ప్లాన్ ఉన్న వినియోగదారులకు మాత్రమే నెట్‌ఫ్లిక్స్ యాక్సెస్ ఉండేది.
అంతేగాక 30 ఎమ్‌బీపీఎస్ ప్రారంభ స్థాయి బ్రాడ్‌బ్యాండ్ పథకంలో ఎలాంటి ఎంటర్‌టైన్‌మెంట్ యాప్‌లు ఉండేవి కావు. ఎయిర్‌ఫైబర్ వినియోగదారులకు కూడా నెట్‌ఫ్లిక్స్ యాక్సెస్ నెలకు రూ.1499 ఆపైన ప్లాన్‌లకే ఉండేది. కొత్త పోస్ట్‌పెయిడ్ బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్ ధర రూ.888 అని, వీటితో అపరిమిత డేటా ప్రయోజనాలు, ఓటీటీలు ఉంటాయని జియో సంస్థ తెలిపింది.
అదేవిధంగా జియోఫైబర్, జియోఎయిర్‌ఫైబర్ వినియోగదార్లకు కూడా ఈ కొత్త ప్లాన్ అందుబాటులో ఉంటుందని జియో కంపెనీ పేర్కొంది. కొత్త ప్లాన్ అందించే 15 ఓటీటీల్లో జియోసినిమా ప్రీమియం, సోనీ లివ్, జీ5, లయన్స్‌గేట్, డిస్కవరీ ప్లస్, ఆల్ట్‌బాలాజీ తదితర యాప్‌లు ఉన్నాయని వెల్లడించింది.
X
Google News
Facebook
Instagram
Youtube
Telegram