Mini Cooper S JCW GP | మినీ కూపర్ స్పెషల్ ఇన్‌స్పైర్డ్ ఎడిషన్.. కేవలం 30 కార్లు మాత్రమే.. ధర ఎంతంటే..!

లగ్జరీ కార్ల తయారీ సంస్థ మినీ ఇండియా భారత మార్కెట్‌లోకి కొత్త Mini Cooper S JCW GP ఇన్‌స్పైర్డ్ ఎడిషన్‌ను విడుదల చేసింది. ఈ ప్రత్యేక ఎడిషన్‌ను రూ.58.90 లక్షల (ఎక్స్ షోరూం) ధరతో అందుబాటులోకి తీసుకొచ్చింది.

Mini Cooper S JCW GP | మినీ కూపర్ స్పెషల్ ఇన్‌స్పైర్డ్ ఎడిషన్.. కేవలం 30 కార్లు మాత్రమే.. ధర ఎంతంటే..!

Mini Cooper S JCW GP | లగ్జరీ కార్ల తయారీ సంస్థ మినీ ఇండియా భారత మార్కెట్‌లోకి కొత్త Mini Cooper S JCW GP ఇన్‌స్పైర్డ్ ఎడిషన్‌ను విడుదల చేసింది. ఈ ప్రత్యేక ఎడిషన్‌ను రూ.58.90 లక్షల (ఎక్స్ షోరూం) ధరతో అందుబాటులోకి తీసుకొచ్చింది. దేశవ్యాప్తంగా కేవలం 30 యూనిట్లను మాత్రమే విక్రయించనున్నట్లు మినీ ఇండియా ప్రకటించింది. ఈ మోడల్ విక్టరీ ఎడిషన్ తర్వాత మినీ కూపర్ S ఆధారంగా భారత్‌లో విడుదలైన రెండో స్పెషల్ ఎడిషన్ ఇది కావడం గమనార్హం.

ఇప్పటికే రూ.1.5 లక్షలతో ప్రీ బుకింగ్స్‌ను ప్రారంభించిన మినీ ఇండియా.. ఇప్పుడు అధికారికంగా ఈ హ్యాచ్‌బ్యాక్‌ను మార్కెట్‌లోకి తీసుకొచ్చింది. ఈ స్పెషల్ ఎడిషన్ కారుకు లెజెండ్ గ్రే పెయింట్ స్కీమ్‌తో ఫినిష్ ఇచ్చారు. దీనికి పూర్తి వ్యత్యాసంగా చిలీ రెడ్ కలర్‌ రూఫ్, మిర్రర్ క్యాప్స్ ఇచ్చారు. కారు మొత్తం ఎరుపు రంగు హైలైట్స్ ఇవ్వడం ద్వారా స్పోర్టీ లుక్‌ను మరింత ఆకర్షణీయంగా తీర్చిదిద్దారు.

ఈ కారు ముందు భాగంలో JCW స్పెసిఫికేషన్ బంపర్, గ్రిల్‌ను అందించారు. ఇందులో JCW లోగో కూడా ప్రత్యేకంగా కనిపిస్తుంది. బంపర్ పక్కన రెడ్ కలర్ వింగ్‌లెట్స్, ఎరుపు టో స్ట్రాప్, బ్యానెట్‌పై ఎరుపు బూడిద రంగు స్ట్రైప్స్ ఇచ్చారు. ఇవి కారుకు ప్రత్యేక గుర్తింపును తీసుకొచ్చాయి. కారు సైడ్‌ భాగంలో కూడా అదే స్ట్రైప్ డిజైన్‌తో పాటు GP Inspired అనే బ్రాండింగ్ అందించారు. వీటన్నింటికీ అదనంగా C పిల్లర్‌పై 1/30 అనే ప్రత్యక గుర్తింపు ఇచ్చారు. అంటే భారత్‌కు వ్చిన 30 కార్లలో ఇది మొదటిది అని అర్థం.

ఈ స్పెషల్ ఎడిషన్‌లో 9.4 అంగుళాల OLED టచ్‌స్క్రీన్, హెడ్ అప్ డిస్‌ప్లే, హార్మన్ కార్డాన్ సౌండ్ సిస్టమ్, వైర్‌లెస్ యాపిల్ కార్ ప్లే, ఆండ్రాయిడ్ ఆటో, కనెక్టెడ్ కార్ టెక్ వంటి ఫీచర్లు ఉన్నాయి. భద్రతాపరంగా మల్టిపుల్ ఎయిర్‌బ్యాగ్స్, ABS, డైనమిక్ స్టెబిలిటీ కంట్రోల్, టైర్ ప్రెషర్ మానిటరింగ్, రియర్ వ్యూ కెమెరా అందించారు. 18 అంగుళాల JCW అలాయ్ వీల్స్, రెడ్ సెంటర్ క్యా్ప్స్, రూఫ్ మౌంటెడ్ వింగ్, రియర్ డిఫ్యూజర్ వంటి ఫీచర్లు ఉన్నాయి.

ఇంజిన్ విషయానికి వస్తే.. ఈ కారులో 2.0 లీటర్ టర్బో పెట్రోల్ ఇంజిన్ ఉంది. ఇది గరిష్టంగా 204 hp పవర్, 300 nm టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఈ ఇంజిన్‌కు 7 స్పీడ్ డ్యూయల్ క్లచ్ ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్ అందించారు. ఈ ఇంజిన్‌తో ఈ హ్యాచ్‌బ్యాక్ కేవలం 6.6 సెకన్లలోనే 100 కి.మీ. వేగాన్ని అందుకుంటుంది. అలాగే దీని టాప్ స్పీడ్ 242 kmph అని తెలిపింది.

Read More:

సుజుకీ బర్గ్‌మాన్ నుంచి 150 సీసీ స్కూటర్.. ఇవీ ఫీచర్లు!

భారత్‌లోనే నార్టన్ అట్లాస్ బైక్ తయారీ.. లాంచ్ ఎప్పుడంటే..!