BSNL | బీఎస్ఎన్ఎల్ చేతికి ఎంటీఎన్ఎల్..! రంగం సిద్ధం చేస్తున్న కేంద్ర ప్రభుత్వం..!

నరేంద్ర మోదీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం మరో కీలక నిర్ణయం దిశగా అడుగులు వేస్తున్నది. ప్రభుత్వ రంగ సంస్థ భారతీయ సంచార్ నిగమ్ లిమిటెడ్లో.. మహానగర్ టెలిఫోన్ నిగమ్ లిమిటెడ్ (MNTL) బాధ్యతలను అప్పగించేందుకు రంగం సిద్ధం చేస్తున్నది

BSNL | బీఎస్ఎన్ఎల్ చేతికి ఎంటీఎన్ఎల్..! రంగం సిద్ధం చేస్తున్న కేంద్ర ప్రభుత్వం..!

BSNL | నరేంద్ర మోదీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం మరో కీలక నిర్ణయం దిశగా అడుగులు వేస్తున్నది. ప్రభుత్వ రంగ సంస్థ భారతీయ సంచార్ నిగమ్ లిమిటెడ్లో.. మహానగర్ టెలిఫోన్ నిగమ్ లిమిటెడ్ (MNTL) బాధ్యతలను అప్పగించేందుకు రంగం సిద్ధం చేస్తున్నది. మొదట కేబినెట్ సెక్రటరీల కమిటీ ఎదుట ప్రతిపాదన పెట్టి.. ఆ తర్వాత కేబినెట్ ఆమోదం కోసం పంపనున్నట్లు తెలుస్తున్నది. వాస్తవానికి రెండు సంస్థలను విలీనం సంకేతాలు రాగా.. తాజాగా విలీనం విషయంలో కేంద్రం పునరాలోచన చేస్తున్నట్లు తెస్తున్నట్లు సమాచారం. అయితే, అప్పుల ఊబిలో కూరుకుపోయిన ఎంటీఎన్ఎల్ను బీఎస్ఎన్ఎల్లో విలీనం చేయడం ఏమాత్రం సరికాదని కేంద్రం భావిస్తున్నట్లు తెలుస్తున్నది. విలీన ప్రక్రియకు బదులుగా కేవలం ఎంఎన్టీఎల్ కార్యకలాపాలకు సంబంధించిన వ్యవహారాలను బీఎస్ఎన్ఎల్కు అప్పగించాలని నిర్ణయానికి వచ్చినట్లు పలు నివేదికలు పేర్కొన్నాయి. మహానగర్ టెలిప్ నిగమ్ లిమిటెడ్ (MNTL) కేవలం దేశ రాజధాని ఢిల్లీతో పాటు ఆర్థిక రాజధాని ముంబయి మహానగరంలో మాత్రమే సేవలు అందిస్తున్నది. ఎంటీఎన్ఎల్కు ప్రస్తుతం దండిగానే అప్పులున్నాయి. ఈ ఏడాది జూలై 20 వరకు బాండ్ హోల్డర్లకు వడ్డీలు కట్టేందుకు కూడా నిధులు లేక ఇబ్బందులుపడుతున్నది. 2023-24 జనవరి-మార్చిలో 46 లక్షల మంది (వైర్- వైర్లెస్) వినియోగదారులు ఎంటీఎన్ఎల్కు ఉన్నారు. ప్రస్తుతం ఈ సంఖ్య 41లక్షలకు పడిపోయింది. అదే సమయంలో కంపెనీ నష్టాలు రూ.2,915 కోట్ల నుంచి రూ.3,267 కోట్లకు పెరిగాయి. గత ఆర్థిక సంవత్సరంలో ఎంటీఎన్ఎల్ సైతం భారీగా పతనమై.. రూ.798.56 కోట్లకు చేరింది. ఈ ఎంటీఎన్ఎల్ నిర్వహణ బాధ్యతలను బీఎస్ఎన్ఎల్కు అప్పగించేందుకు కేంద్రం సిద్ధమవుతున్నది. ఇదిలా ఉండగా.. బీఎస్ఎన్ఎల్కు ప్రస్తుతం దేశవ్యాప్తంగా 88.94 మిలియన్స్ యూజర్లు ఉన్నారు.

దేశంలోనే నాలుగో అతిపెద్ద టెలికమ్యూనికేషన్ నెట్వర్క్ను బీఎస్ఎన్ఎల్ ఉన్నది. ప్రస్తుతం ప్రభుత్వ రంగ సంస్థ త్వరలోనే దేశవ్యాప్తంగా 4జీ సేవలను విస్తరించబోతున్నది. దీంతో కంపెనీకి భారీగా యూజర్లు చేరబోతున్నది. ఇతర కంపెనీలకు చెందిన ఆపరేటర్లు రీఛార్జ్ రేట్లను భారీగా పెంచిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆయా యూజర్లను తన వైపు తిప్పుకునేందుకు బీఎస్ఎన్ఎల్ ప్రణాళిక రూపొందించింది. ప్రస్తుతం బీఎస్ఎన్ఎల్కు దేశవ్యాప్తంగా మౌలిక సదుపాయాలున్నాయి. ఈ క్రమంలో 4జీ సేవలను విస్తరించడంతో తక్కువ ధరకే ఎక్కువ వ్యాలిడిటీతో రీఛార్జ్ ప్లాన్ను ప్రకటిస్తూ యూజర్లను తన వైపునకు దృష్టి మళ్లించే ప్రయత్నం చేస్తున్నది. ఇదే జరిగితే రాబోయే రోజుల్లో బీఎస్ఎన్ఎల్కు పూర్వవైభవం రానున్నది.