Changes From September | సెప్టెంబర్ నుంచి మారనున్న ఐదు కీలక రూల్స్.. మీ జేబులపై ప్రభావం చూపే ఛాన్స్..!
Changes From September | ఈ ఆర్థిక సంవత్సరంలో మరో నెల ముగియబోతున్నది. సెప్టెంబర్ నుంచి నిత్య జీవితంలో ఆర్థిక వ్యవహారాలకు సంబంధించి పలు అంశాల్లో మార్పులు కనిపించనున్నాయి. ఎల్‌పీజీ గ్యాస్ సిలిండర్ ధరలు, సీఎన్‌జీ, క్రెడిట్ కార్డులు, జీఎస్టీ తదితర అంశాల్లో మార్పులు జరుగబోతున్నాయి.
Changes From September | ఈ ఆర్థిక సంవత్సరంలో మరో నెల ముగియబోతున్నది. సెప్టెంబర్ నుంచి నిత్య జీవితంలో ఆర్థిక వ్యవహారాలకు సంబంధించి పలు అంశాల్లో మార్పులు కనిపించనున్నాయి. ఎల్‌పీజీ గ్యాస్ సిలిండర్ ధరలు, సీఎన్‌జీ, క్రెడిట్ కార్డులు, జీఎస్టీ తదితర అంశాల్లో మార్పులు జరుగబోతున్నాయి. సెప్టెంబర్ ఒకటి నుంచి ఐదు కీలక నిబంధనలు మారనున్నాయి. ఫలితంగా ఖర్చులు పెరగనున్నాయి. ఆ మార్పులు ఏంటో తెలుసుకుందాం..!
ఆధార్‌కార్డు అప్‌డేట్ విషయంలో సెప్టెంబర్‌లో నిబంధనలు మారనున్నాయి. ఆధార్‌ను ఉచితంగా అప్‌డేట్ చేసుకునేందుకు చివరి గడువు సెప్టెంబర్ 14. ఆ తర్వాత అప్‌డేట్ చేసుకునేందుకు డబ్బులు చెల్లించాల్సి రానున్నది. వచ్చే నెల 14 వరకు ఉచితంగా పేరు, అడ్రస్, ఫోన్ నంబర్, బయోమెట్రిక్ తదితర వివరాలను అప్‌డేట్ చేసుకునేందుకు వీలుంది. ఆ తర్వాత ఆయా వివరాలను అప్‌డేట్ చేసుకునేందుకు డబ్బులు చెల్లించాల్సి రానున్నది. అలాగే, సెప్టెంబర్‌లో ఇంధన ధరలు మారనున్నాయి. పెట్రోల్ డీజిల్, ఏవియేషన్ ఫ్యూయల్ ధరలు మారనున్నాయి. ఒక్కోసారి ధరలు పెరగడం, మరోసారి తగ్గేందుకు అవకాశం ఉంటుంది. ఎల్పీజీ సిలెండర్ ధరలు సైతం ప్రతి నెలా పెరగడం లేదా తగ్గుతుంటాయి. ఎల్పీజీ డొమెస్టిక్ అంటే 14 కేజీల సిలెండర్, కమర్షియల్ అంటే 19 కిలోల సిలెండర్ ధరలు ప్రతి నెలా ఒకటో తేదీన పెరగడమో, తగ్గడమో జరుగుతుంటుంది. ఇటీవల కమర్షియల్ సిలిండర్ ధరలు మాత్రమే మారాయి.
సెప్టెంబర్ నుంచి జీఎస్టీలో సైతం మార్పులు రానున్నాయి. సరైన బ్యాంక్ అకౌంట్ ఇవ్వని జీఎస్టీ ట్యాక్స్ పేయర్లు జీఎస్‌టీఆర్ వన్ రిటర్న్స్ సమర్పించేందుకు సాధ్యం కాదు. ఈ మార్పు సెప్టెంబర్ ఒకటి నుంచి అమల్లోకి రానుంది. జీఎస్టీ రూల్ 10ఏ ప్రకారం రిజిస్ట్రేషన్‌కు 30 రోజుల్లోగా సరైన బ్యాంక్ వివరాలు సమర్పించాల్సి ఉంటుంది. జీఎస్‌టీఆర్ 1 ఫామ్ ద్వారా వీటిని ఫైల్ చేయాల్సి ఉంటుంది. అలాగే. సెప్టెంబర్ ఒకటి నుంచి క్రెడిట్ కార్డులకు సంబంధించి నిబంధనలు మారనున్నాయి. ఐడీఎఫ్‌సీ బ్యాంక్, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ క్రెడిట్ కార్డు రూల్స్ మారనున్నాయి. ఐడీఎఫ్‌సీ క్రెడిట్ కార్డు మినిమం డ్యూ, చెల్లింపు తేదీ రెండూ మారబోతుండగా.. హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ లాయల్టీ ప్రోగ్రామ్ సైతం మారుస్తూ నిర్ణయం తీసుకున్నది.
X
Google News
Facebook
Instagram
Youtube
Telegram