Real Estate | బ్రోక‌ర్ స‌హాయం లేకుండానే సొంతింటి క‌ల సాధ్యం..! అదేలాగంటే..?

Real Estate | మీకు సొంతింటి క‌ల( Own House ) సాకారం చేసుకోవాల‌ని ఉందా..? అందుకు రియ‌ల్ ఎస్టేట్ బ్రోక‌ర్ల‌ను( Real Estate Brokers ) సంప్ర‌దిస్తున్నారా..? అయితే ఇప్పుడు బ్రోక‌ర్ల అవ‌స‌ర‌మే లేదు.. ఆర్టిఫిషియ‌ల్ ఇంటెలిజెన్స్( Artificial Intelligence ) స‌హాయంతో తమ సొంతింటి క‌ల‌ను సాకారం చేసుకోవ‌చ్చు. అదేలాగో ఈ క‌థ‌నంలో తెలుసుకుందాం.

  • By: raj |    business |    Published on : Dec 31, 2025 9:30 AM IST
Real Estate | బ్రోక‌ర్ స‌హాయం లేకుండానే సొంతింటి క‌ల సాధ్యం..! అదేలాగంటే..?

Real Estate | ప్ర‌తి ఒక్క‌రికి సొంతిల్లు( Own House ) ఉండాల‌నే కోరిక ఉంటుంది. కానీ ఆ సొంతింటి క‌ల సాకారం చేసుకునేందుకు అష్ట‌క‌ష్టాలు ప‌డుతుంటారు. బ్రోక‌ర్ల‌ను(మ‌ధ్య‌వ‌ర్తులు) సంప్ర‌దిస్తుంటారు. వారు చెప్పే మాయ‌మాట‌ల‌కు బోల్తా ప‌డి.. ల‌క్ష‌ల రూపాయాలు వృథా చేసుకుంటారు. అయితే ఇప్పుడు బ్రోక‌ర్ల( Real Estate Brokers ) అవ‌స‌రం లేదు.. ల‌క్ష‌ల రూపాయాలు వృథా చేసుకోవాల్సిన అవ‌స‌రం లేదు. ఆర్టిఫిషియ‌ల్ ఇంటెలిజెన్స్( Artificial Intelligence ) స‌హాయంతో త‌మ సొంతింటి క‌ల‌ను సాకారం చేసుకోవ‌చ్చు. అభివృద్ధిలో అగ్ర భాగాన ఉన్న అమెరికా( America ) లాంటి అగ్ర దేశాల్లో ఏఐ( AI ) స‌హాయంతోనే సొంతింటిని కొనుగోలు చేస్తున్నారు. అదేలాగో ఈ క‌థ‌నంలో తెలుసుకుందాం.

అమెరికా లాంటి దేశాల్లో ఏఐ స‌హాయంతో కొత్త ఇల్లును కొనుగోలు చేస్తున్నారు. పర్సనలైజ్‌డ్‌ ప్రాపర్టీ సిఫార్సులు, వర్చువల్ టూర్లు, ఆటోమేటెడ్ డాక్యుమెంట్ వెరిఫికేషన్ ద్వారా బ్రోక‌ర్ల‌ అవసరం లేకుండానే పనులను చక్కబెట్టుకుంటున్నారు. ఇప్పుడు ఇదే ట్రెండ్ ఇండియా( India ) రియల్ ఎస్టేట్ (real estate) రంగంలోనూ మొదలైంది. ఏజెంట్లు లేకుండా, భారీగా బ్రోకరేజ్ ఫీజులు చెల్లించకుండా ఇల్లు కొనడం భారత్‌లో సాధ్యమేనా? అంటే నిపుణుల నుంచి ‘అవును’ అనే సమాధానం వస్తోంది.

బ్రోక‌ర్లు అక్కర్లేదు.. ఏఐ ఆధారిత టూల్స్‌తో ఇంటిని కొనుగోలు చేయొచ్చు..

ఇండియాలో ప్ర‌ధానంగా ‘నో బ్రోకర్’ (NoBroker), ‘హౌసింగ్ డాట్ కామ్’ (Housing.com) వంటి ప్లాట్‌ఫారమ్‌లు ఇల్లు కొనాల‌నుకునే వారిని నేరుగా ఆ ఇంటి య‌జ‌మానుల‌తో అనుసంధానం చేస్తున్నాయి. అంటే ఇక్క‌డ మ‌ధ్య‌వ‌ర్తుల ప్ర‌మేయం లేదు. ఇక ఏఐ ఆధారిత టూల్స్ ద్వారా మీకు న‌చ్చిన ఏరియాలో ఇంటిని ఎంపిక చేసుకోవ‌చ్చు. అంతేకాకుండా మీ బ‌డ్జెట్‌లో ఇళ్ల‌ను సుల‌భంగా షార్ట్ లిస్ట్ చేసుకోవ‌చ్చు. దీంతో బ్రోక‌రేజ్ ఫీజులు ల‌క్ష‌ల్లో చెల్లించుకోవాల్సిన అవ‌స‌రం కూడా ఉండ‌దు. అంటే ల‌క్ష‌ల రూపాయాల‌ను ఆదా చేసుకోవ‌చ్చు. కేవలం రెడీ-టు-మూవ్ ఇళ్లే కాకుండా అండర్ క‌న్‌స్ట్ర‌క్ష‌న్‌ ప్రాజెక్టులను కూడా డెవలపర్ వెబ్‌సైట్లు లేదా రేరా (RERA) పోర్టల్స్ ద్వారా నేరుగా పరిశీలించి త‌మ‌కు న‌చ్చిన ఇంటిని కొనుగోలు చేసే వెసులుబాటు ఉంది.

ఈ ప‌నుల‌కు బ్రోక‌ర్ అవ‌స‌రం లేదు..

అయితే ఒక కొత్త ఇల్లును కొనుగోలు చేయాల‌నుకున్న‌ప్పుడు బ్రోక‌ర్ అవ‌స‌రం లేద‌నుకుంటే.. కొనుగోలుదారుడే పూర్తి బాధ్యత తీసుకోవాల్సి ఉంటుంది. కాబ‌ట్టి ఒక ప‌క్కా ప్ర‌ణాళిక ప్ర‌కారం ఇంటి కొనుగోలుకు ముందడుగు వేయాల్సి ఉంటుంది. మ‌రి ఆ ప్లానేంటో చూద్దాం.

బడ్జెట్ నిర్ణయం: డౌన్ పేమెంట్, స్టాంప్ డ్యూటీ, రిజిస్ట్రేషన్ ఖర్చులు, లోన్ ఎలిజిబిలిటీని ముందుగానే అంచనా వేయాలి.
ప్రభుత్వ పథకాలు: మొదటిసారి ఇల్లు కొనేవారు పీఎంఏవై (PMAY) వంటి సబ్సిడీలను తనిఖీ చేయాలి.
ప్రాపర్టీ సెర్చ్: నో బ్రోకర్, మ్యాజిక్ బ్రిక్స్ లేదా 99 ఏకర్స్ వంటి సైట్లలో ‘డైరెక్ట్ ఓనర్’ లిస్టింగ్స్ మాత్రమే వెతకాలి.

లీగ‌ల్ అంశాల‌పై అప్ర‌మ‌త్త‌త అవ‌స‌రం..!

బ్రోక‌ర్ స‌హాయం లేకుండా ఇంటిని కొనుగోలు చేస్తున్న‌ప్పుడు.. కొనుగోలుదారుడు పూర్తిస్థాయిలో ప్ర‌తి విష‌యంలో అప్ర‌మ‌త్తంగా ఉండాల్సిన అవ‌స‌రం ఉంది. రేరా రిజిస్ట్రేష‌న్ ఉందా లేదా అని పూర్తిస్థాయిలో చెక్ చేసుకోవాలి. అలాగే ఎన్‌కంబరెన్స్ సర్టిఫికేట్ (EC), ఫైర్ సేఫ్టీ ఎన్‌ఓసీ (NOC), మున్సిపల్ అప్రూవల్స్ వంటివి స్వయంగా పరిశీలించాలి. మీరు ఏజెంట్ ఫీజు ఆదా చేస్తున్నప్పుడు, ఆ డబ్బులో కొంచెం ఖర్చు పెట్టి ఒక నిపుణుడైన లాయర్‌ను సంప్రదించడం మంచిది. టైటిల్ సెర్చ్ ద్వారా ఆ ప్రాపర్టీకి ఎలాంటి వివాదాలు లేవని నిర్ధారించుకోవాలి. అప్పుడే కొత్త ఇల్లు కొనుగోలుకు ముంద‌డుగు వేయాలి.

రిజిస్ట్రేషన్ ప్రక్రియ

ఇల్లు నచ్చాక.. టోకెన్ అమౌంట్ చెల్లించి అలాట్‌మెంట్ లెటర్ తీసుకోవాలి. సేల్ అగ్రిమెంట్ పత్రాలను జాగ్రత్తగా చదివి సంతకం చేయాలి. రిజిస్ట్రేషన్ సమయంలో స్టాంప్ డ్యూటీ, రిజిస్ట్రేషన్ ఫీజులను సబ్- రిజిస్ట్రార్ కార్యాలయంలో చెల్లించాలి. మొత్తం పేమెంట్లను బ్యాంక్ ట్రాన్స్‌ఫర్ల ద్వారానే చేయడం సురక్షితం.

కొత్త శకం మొదలైందా?

ఏదేమైనా ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, ఏఐ టూల్స్ అందుబాటులోకి రావడంతో భారతీయ రియల్ ఎస్టేట్ (real estate) రంగంలో పారదర్శకత పెరిగింది. ఒకప్పుడు ఏజెంట్లు చెప్పిందే వేదంగా ఉండేది. కానీ, ఇప్పుడు ప్రతి సమాచారం మన చేతుల్లోని మొబైల్ లోనే అందుబాటులో ఉంది. సరైన అవగాహన, కొంచెం ఓపిక ఉంటే ఏజెంట్ సహాయం లేకుండానే మీ కలల ఇంటిని సొంతం చేసుకోవచ్చు. సో మీరు కూడా సొంతింటి కోసం ట్రై చేయండి.