Home Loan | హోమ్ లోన్ కడుతున్నారా.. ఈ సీక్రెట్ ట్రిక్‌తో లక్షల్లో వడ్డీ ఆదా చేసుకోవచ్చు!

Home Loan | మీరు హోమ్ లోన్ కడుతున్నారా? అసలు కంటే వడ్డీకే ఎక్కువ మొత్తం పోతుందని బాధ పడుతున్నారా? అయితే ఈ చిన్న సీక్రెట్ ట్రిక్ యూజ్ చేస్తే మీ లోన్‌లో దాదాపు 20 లక్షల వరకు ఆదా చేసుకోవచ్చు. అలాగే ఐదేళ్ల ముందే గృహ రుణాన్ని క్లోజ్ కూడా చేసుకోవచ్చని నిపుణులు చెబుతున్నారు.

Home Loan | హోమ్ లోన్ కడుతున్నారా.. ఈ సీక్రెట్ ట్రిక్‌తో లక్షల్లో వడ్డీ ఆదా చేసుకోవచ్చు!

Home Loan | సొంతింటి కల నెరవేర్చుకోవడానికి హోమ్ లోన్ తీసుకోవడం ఈరోజుల్లో చాలా సులభమే. కానీ దాన్ని 20 నుంచి 25 ఏళ్ల పాటు ఈఎంఐలు చెల్లించేప్పుడే అసలు కష్టం తెలుస్తోంది. అసలు కంటే వడ్డీనే ఎక్కువ కట్టాల్సి వస్తుందన్న బాధ మనల్ని అనుక్షణం తొలచివేస్తుంది. అయితే ఒక చిన్న ట్రిక్ యూజ్ చేయడం ద్వారా హోం లోన్‌పై పడే వడ్డీ భారాన్ని భారీగా తగ్గించుకోవచ్చు. అదే ‘స్మార్ట్ పేమెంట్ ట్రిక్’.

20లక్షల వరకు వడ్డీ ఆదా చేసుకోవచ్చు!

ఈ స్మార్ట్ పేమెంట్ ట్రిక్‌ను వాడటం ద్వారా రుణగ్రహీతలు లక్షల్లో వడ్డీని ఆదా చేసుకోవచ్చని ఆర్థిక నిపుణులు లెక్కలేసి మరీ చెబుతున్నారు. అదెలా అంటే.. సాధారణంగా హోమ్ లోన్స్ అనేవి లాంగ్‌టర్మ్ రుణాలు. వీటి టెన్యూర్ 20 నుంచి 30 ఏళ్ల వరకు ఉంటుంది. ఇలా టెన్యూర్ ఎక్కువగా ఉండటం వల్ల బ్యాంకులు వడ్డీ రూపంలో భారీ మొత్తాన్ని వసూలు చేస్తుంటాయి. ఉదాహరణకు రూ.50 లక్షల హోమ్ లోన్‌ను 25 సంవత్సరాల కాలపరిమితితో 8.5 శాతం వడ్డీ రేటుతో తీసుకున్నట్లయితే నెలకు ఈఎంఐ సుమారుగా రూ.40,261 చెల్లించాల్సి ఉంటుంది. అంటే 25 సంవత్సరాల టెన్యూర్ పూర్తయ్యే సరికి దాదాపు రూ.1.20 కోట్లను రుణగ్రహీతలు బ్యాంకులకు చెల్లిస్తారు. అందులో అసలు 50 లక్షలు తీసేస్తే.. వడ్డీనే 70 లక్షల వరకు ఉంటుంది. అంటే తీసుకున్న అసలు రుణం కంటే దాదాపు రెట్టింపు మొత్తాన్ని వడ్డీల రూపంలో చెల్లించాల్సి ఉంటుంది. కానీ స్మార్ట్ పేమెంట్ ట్రిక్‌ను యూజ్ చేస్తే దాదాపు 20 లక్షల వరకు వడ్డీని ఆదా చేసుకోవచ్చని నిపుణులు చెబుతున్నారు.

ఏంటి ఆ సీక్రెట్ ట్రిక్!

ఆర్థిక నిపుణులు చెబుతున్న ఈ ట్రిక్ ప్రకారం ఏటా ఒక ఈఎంఐని అదనంగా చెల్లించాలి. అంటే ఏడాదిలో 12 ఈఎంఐలకు బదులుగా 13 ఈఎంఐలు చెల్లించాలి. అదనంగా చేసిన ఈ పేమెంట్‌ను బ్యాంకులు ప్రిన్సిపల్ ప్రీపేమెంట్‌గా పరిగణిస్తే అసలు రుణం తగ్గుతుంది. దాంతో వడ్డీ కూడా బాగా తగ్గుతుంది. ఈ ట్రిక్ ఫాలో అవ్వడం ద్వారా రూ.50 లక్షల హోమ్ లోన్‌కు వడ్డీ రూ.54 లక్షల వరకు తగ్గుతుంది. అప్పుడు దాదాపు 18 లక్షల వరకు ఆదా అవుతుంది. అంతేకాకుండా ఎక్స్‌ట్రా ఈఎంఐ వల్ల లోన్ టెన్యూర్ కూడా దాదాపు ఐదు నుంచి ఆరేళ్ల వరకు తగ్గుతుందని నిపుణులు చెబుతున్నారు.

మొదటి సంవత్సరాల్లోనే ఎక్కువ లాభం

హోమ్ లోన్ తీసుకున్న ప్రారంభ సంవత్సరాల్లో ఈఎంఐలో ఎక్కువ భాగం వడ్డీకే వెళ్తుంది. ఉదాహరణకు రూ.40,261 ఈఎంఐలో వడ్డీనే రూ.35వేల వరకు ఉండొచ్చు. అందుకే మొదటి ఐదు నుంచి ఐడు సంవత్సరాల్లో అదనపు ఈఎంఐ చెల్లిస్తే వడ్డీపై భారీగా తగ్గిపోతుంది.

అదనపు ఈఎంఐ చెల్లిస్తే పాటించాల్సిన ముఖ్య నియమం

ఏడాదికి 12 ఈఎంఐలు కాకుండా అదనంగా అమౌంట్ చెల్లిస్తే దాన్ని చాలా వరకు బ్యాంకులు అడ్వాన్స్ ఈఎంఐగానే పరిగణించే అవకాశం ఉంది. అలా జరిగితే వడ్డీ సేవింగ్ జరగదు. కాబట్టి అదనపు ఈఎంఐ చెల్లించే సమయంలో బ్యాంకులను సంప్రదించి, ప్రిన్సిపల్ ప్రీపేమెంట్‌లో అడ్జస్ట్ చేయమని స్పష్టంగా చెప్పాలి. ప్రతి ఏడాది ఒక అదనపు ఈఎంఐ చెల్లించడం అందరికీ సాధ్యం కాకపోవచ్చు. అలాంటి వారు నెలకు రూ.2 వేల నుంచి 5 వేల వరకు అదనంగా పేమెంట్ చేయడం లేదా ప్రతి ఏటా ఈఎంఐని 5-10 శాతం పెంచినా కూడా లక్షల్లో వడ్డీ తగ్గే అవకాశం ఉంటుంది.

Read More:

Home loan protection policy  | హౌజింగ్ లోన్‌‌తో పాటు ఇన్సూరెన్స్ తీసుకోవాలి

Personal Loan Vs Mortgage Loan | పర్సనల్ లోన్, తాకట్టు రుణం: మీ అవసరాలకు సరైన రుణాన్ని ఎలా ఎంచుకోవాలి?