PNB Bank | పంజాబ్‌ నేషనల్‌ బ్యాంకులో ఖాతా ఉందా..? మరి కేవైసీ పూర్తి చేశారా..?

PNB Bank | ప్రభుత్వరంగ బ్యాంకు పంజాబ్‌ నేషనల్‌ బ్యాంకు ఖాతాదారులకు కీలక హెచ్చరికలు చేసింది. వీలైనంత త్వరగా కేవైసీని పూర్తి చేయాలని లేకపోతే ఇబ్బందులుపడాల్సి వస్తుందని పేర్కొంది. దాదాపు 3.25లక్షల అకౌంట్లు స్తంభించే అవకాశాలున్నాయని పేర్కొంది.

PNB Bank | పంజాబ్‌ నేషనల్‌ బ్యాంకులో ఖాతా ఉందా..? మరి కేవైసీ పూర్తి చేశారా..?

PNB Bank | ప్రభుత్వరంగ బ్యాంకు పంజాబ్‌ నేషనల్‌ బ్యాంకు ఖాతాదారులకు కీలక హెచ్చరికలు చేసింది. వీలైనంత త్వరగా కేవైసీని పూర్తి చేయాలని లేకపోతే ఇబ్బందులుపడాల్సి వస్తుందని పేర్కొంది. దాదాపు 3.25లక్షల అకౌంట్లు స్తంభించే అవకాశాలున్నాయని పేర్కొంది. గడువులోగా కేవైసీ అప్‌డేట్‌ చేసుకోవాలని.. లేఖపోతే ఖాతాలు నిలిచిపోతాయని చెప్పింది. ఈ నెల 12లోగా కేవైసీని అప్‌డేట్‌ చేయలని సూచింది. ప్రక్రియ పూర్తి చేస్తేనే ఖాతా యాక్టివ్‌లో ఉంటుందని తెలిపింది.

గడువులోగా కేవైసీ చేయని ఖాతాలను మూసివేయనున్నట్లు పేర్కొంది. సేవింగ్స్‌, కరెంటు ఖాతాలన్నీ స్తంభిస్తాయని తెలిపింది. ఆ తర్వాత అకౌంట్లలో ఉన్న డబ్బులను ట్రాన్స్‌ఫర్‌ చేయలేరని తెలిపింది. కేవైసీ కోసం ఐడీ ప్రూఫ్‌, పాస్‌పోర్ట్‌ సైజ్‌ ఫొటో, ఇన్‌కం రుజువు, ఆధార్ కార్డ్, పాన్ కార్డ్ అవసరమవుతుంది. ఆయా పత్రాలన్నింటిని సమీపంలోని బ్యాంకులో సంప్రదించాలి. అక్కడ కేవైసీ ఫారాన్ని ఫిల్‌ చేసే బ్యాంకు సిబ్బందికి అందిస్తే కేవైసీ ప్రక్రియ పూర్తవుతుంది. అయితే, ఆన్‌లైన్‌ బ్యాంకు.. ఇంటర్‌నెట్‌ బ్యాంకింగ్‌ ద్వారా సైతం కేవైసీని పూర్తి చేసేందుకు అవకాశం ఉన్నది.

లేకపోతే రిజిస్టర్డ్‌ ఈమెయిల్‌ ద్వారా సైతం కేవైసీని పూర్తి చేసేందుకు అవకాశం ఉంది. ఖాతా నంబర్‌తో పాటు ఇతర వివరాలు, పత్రాలన్నీ జతచేసి బ్యాంకుకు మెయిల్‌ చేసినా కేవైసీ అప్‌డేట్‌ అవుతుందని బ్యాంకు తెలిపింది. పంజాబ్‌ నేషనల్‌ బ్యాంకులో ఖాతా ఉండి.. ఇప్పటి వరకు కేవైసీ ప్రక్రియను పూర్తి చేయని వారంతా తక్షణమే ఏదో ఒక విధానంలో కేవైసీ పూర్తి చేస్తే అకౌంట్‌ క్లోజ్‌ కాకుండా ఉంటుంది. భవిష్యత్‌లో లావాదేవీలు జరిపేందుకు అవకాశం ఉంటుంది. లేకపోతే మళ్లీ బ్యాంకు చుట్టు తిరగాల్సిన పరిస్థితి ఎదురయ్యే అవకాశం ఉంటుంది.