Poonawalla: పసిడి రుణ వ్యాపారంలోకి.. పూనావాలా ఫిన్‌కార్ప్

ముంబై: సైరస్ పూనావాలా గ్రూప్ ఆధ్వర్యంలోని ఎన్‌బీఎఫ్‌సీ సంస్థ పూనావాలా ఫిన్‌కార్ప్ లిమిటెడ్ (పీఎఫ్‌ఎల్) కొత్తగా పసిడి రుణ వ్యాపారంలోకి ప్రవేశించింది. వ్యాపార విస్తరణ, వ్యవసాయ ఖర్చులు, వ్యక్తిగత అవసరాల కోసం వ్యక్తులు, వ్యాపారాలకు సురక్షిత, వేగవంతమైన, పారదర్శక రుణ సేవలను అందించనుంది.30 నిమిషాల్లో రుణ ఆమోదం, తక్కువ డాక్యుమెంటేషన్, బహుళ చెల్లింపు ఎంపికలతో కస్టమర్లు తమ బంగారాన్ని విక్రయించకుండా నిధులు పొంది, సంపదను దీర్ఘకాలం సంరక్షించుకోవచ్చు.
“మా సెక్యూర్డ్ రుణ పోర్ట్‌ఫోలియోలో పసిడి రుణాలు కీలక భాగం. బంగారం భావోద్వేగ, ఆర్థిక విలువను గౌరవిస్తూ, కస్టమర్ అవసరాలకు తగ్గట్టు ఈ ఉత్పత్తిని రూపొందించాం. పారదర్శకత, ప్రీమియం సేవలతో కస్టమర్ అసెట్లకు అత్యధిక భద్రత కల్పిస్తాం” అని పీఎఫ్‌ఎల్ ఎండీ & సీఈవో అరవింద్ కపిల్ తెలిపారు. “భారతీయులకు బంగారం సంపద, భద్రతకు విశ్వసనీయ మూలం. సత్వర నిధుల అవసరాలకు ఇది వ్యూహాత్మక అసెట్‌గా ఉపయోగపడుతుంది. పట్టణ, గ్రామీణ మార్కెట్లలో వృద్ధి అంచనాల నేపథ్యంలో గోల్డ్ లోన్ మార్కెట్‌లో గణనీయ అవకాశాలున్నాయి.
తక్కువ రిస్క్‌తో సురక్షిత వ్యాపారంగా పసిడి రుణాలు నిలుస్తున్నాయి. ప్రీమియం సేవలతో ఈ అవకాశాలను అందిపుచ్చుకునేందుకు పీఎఫ్‌ఎల్ సిద్ధంగా ఉంది. రానున్న నాలుగు త్రైమాసికాల్లో 400 కొత్త శాఖలను దశలవారీగా ప్రారంభించి, ద్వితీయ, తృతీయ శ్రేణి నగరాల్లో కార్యకలాపాలను బలోపేతం చేయాలని పీఎఫ్‌ఎల్ లక్ష్యంగా పెట్టుకుంది. విలువ కట్టడం, భద్రత, పారదర్శకతకు ప్రాధాన్యమిస్తూ, కస్టమర్ల ఆర్థిక అవసరాలకు విశ్వసనీయ పరిష్కారాలను అందిస్తోంది. బంగారాన్ని విక్రయించకుండా సకాలంలో రుణాలు పొందే సౌలభ్యాన్ని కంపెనీ కల్పిస్తోంది. రుణ ప్రక్రియను సరళీకరించి, కస్టమర్లకు మెరుగైన అనుభవాన్ని అందించడానికి పీఎఫ్‌ఎల్ ప్రాధాన్యమిస్తోంది” అని ఆయన పేర్కొన్నారు.