Retail Inflation | కూరగాయల ధరలు కుతకుత.. 5.49శాతానికి రిటైల్‌ ద్రవ్యోల్బణం..

రిటైల్ ద్రవ్యోల్బణం సెప్టెంబర్‌లో భారీగా పెరిగింది. కూరగాయల పెరుగుదల నేపథ్యంలో భారత రిటైల్ ద్రవ్యోల్బణం వార్షిక ప్రాతిపదికన 5.49 శాతానికి చేరుకున్నది. ఈ మేరకే భారతీయ రిజర్వ్ బ్యాంక్ (RBI) లక్ష్యం కంటే ఎగువన నమోదైందని కేంద్ర గణాంకాల కార్యాలయం(NSO) సోమవారం ఒక ప్రకటనలో పేర్కొంది.

Retail Inflation | కూరగాయల ధరలు కుతకుత.. 5.49శాతానికి రిటైల్‌ ద్రవ్యోల్బణం..

Retail Inflation | రిటైల్ ద్రవ్యోల్బణం సెప్టెంబర్‌లో భారీగా పెరిగింది. కూరగాయల పెరుగుదల నేపథ్యంలో భారత రిటైల్ ద్రవ్యోల్బణం వార్షిక ప్రాతిపదికన 5.49 శాతానికి చేరుకున్నది. ఈ మేరకే భారతీయ రిజర్వ్ బ్యాంక్ (RBI) లక్ష్యం కంటే ఎగువన నమోదైందని కేంద్ర గణాంకాల కార్యాలయం(NSO) సోమవారం ఒక ప్రకటనలో పేర్కొంది. రిటైల్ ద్రవ్యోల్బణం గత నెలలో నమోదైన 5 సంవత్సరాల కనిష్ఠానికంటే 3.65శాతం కంటే ఎక్కువగా. జూలై తర్వాత తొలిసారిగా భారతీయ రిజర్వ్ బ్యాంక్ (RBI) మధ్యకాలిక లక్ష్యమైన 4శాతాన్ని అధిగమించింది.

వినియోగదారుల ధరల సూచీ (CPI)లో సగం వాటా కలిగిన ఆహార పదార్థాల ద్రవ్యోల్బణం సెప్టెంబర్‌లో 9.24శాతానికి చేరుకుంది. ఆగస్టులో రిటైల్‌ ద్రవ్యోల్బణం 5.66గా ఉన్నది. ఇంతకుముందు వినియోగదారుల ధరల సూచీ (CPI) ఆధారిత రిటైల్ ద్రవ్యోల్బణం జూలై 2024లో 3.6 శాతం, ఆగస్టు 2024లో 3.65 శాతంగా ఉంది. జూలై, ఆగస్టు రెండు నెలల్లోనూ రిజర్వ్ బ్యాంక్ లక్ష్యం 4 శాతంలోపు నమోదైంది. మరో వైపు, ఆగస్టు 2023లో రిటైల్ ద్రవ్యోల్బణం 6.83 శాతంగా ఉండగా.. కూరగాయలు, ఇతర ధరల పెరుగుదల కారణంగా సెప్టెంబర్‌లో టోకు ధరల ద్రవ్యోల్బణం 1.84 శాతానికి పెరిగింది. ఆగస్టులో టోకు ధరల సూచీ (WPI) ఆధారిత ద్రవ్యోల్బణం 1.31 శాతంగా ఉన్నది. గతేడాది సెప్టెంబర్‌లో 0.07 శాతం పడిపోయింది. సోమవారం విడుదల చేసిన ప్రభుత్వ గణాంకాల ప్రకారం.. ఆహార ద్రవ్యోల్బణం సెప్టెంబర్‌లో 11.53 శాతానికి పెరగ్గా.. ఆగస్టులో ఇది 3.11 శాతానికి చేరుకుంది.

సెప్టెంబర్‌లో 48.73శాతం పెరిగిన కూరగాయల ధరల పెరుగుదలే దీని కారణం. ఆగస్టులో 10.01 శాతం పడిపోయింది. బంగాళదుంపలు సెప్టెంబర్‌లో 78.13 శాతం, ఉల్లి 78.82 శాతంగా ధరల పెరుగుదల నమోదైంది. ఇదిలా ఉండగా.. గతవారం జరిగిన ఎంపీసీ సమావేశంలో కీలకమైన వడ్డీ రేట్లను యధాతథంగా కొనసాగిస్తున్నట్లు ఆర్‌బీఐ ప్రకటించిన విషయం తెలిసిందే.