Niveshak Shivir : హైదరాబాద్‌లో ‘నివేశక్ శివిర్’
హైదరాబాద్‌లో ‘నివేశక్ శివిర్’ను సెబీ, సీడీఎస్ఎల్, బీఎస్ఈ ఐపీఎఫ్ నిర్వహించాయి. క్లెయిమ్ చేయని డివిడెండ్లు, షేర్లను రీక్లెయిమ్ చేసుకోవడంలో ఇన్వెస్టర్లకు సహాయం అందించడమే దీని లక్ష్యం.

హైదరాబాద్, విధాత: సెక్యూరిటీస్ అండ్ ఎక్స్చేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా (సెబీ), ఇన్వెస్టర్ ఎడ్యుకేషన్ అండ్ ప్రొటెక్షన్ ఫండ్ అథారిటీ, కార్పొరేట్ వ్యవహారాల శాఖ పరిధిలో సీడీఎస్ఎల్ ఇన్వెస్టర్ ప్రొటెక్షన్ ఫండ్ (సీడీఎస్ఎల్ ఐపీఎఫ్), బీఎస్ఈ ఇన్వెస్టర్ ప్రొటెక్షన్ ఫండ్ (బీఎస్ఈ ఐపీఎఫ్) కలిసి 2025 ఆగస్టు 30న హైదరాబాద్‌లో ‘నివేశక్ శివిర్’ను (Niveshak Shivir) నిర్వహించాయి. చెల్లించబడని డివిడెండ్లు, క్లెయిమ్ చేయని షేర్లను రీక్లెయిమ్ చేసుకోవడంలో షేర్‌హోల్డర్లకు సహాయం అందించేందుకు, తద్వారా వ్యవస్థలో అన్‌క్లెయిమ్డ్ ఇన్వెస్టర్ అసెట్స్ పరిమాణాన్ని తగ్గించడంతో పాటు తమ పెట్టుబడులను పరిరక్షించుకోవడంలో ఇన్వెస్టర్లకు సాధికారత కల్పించడం లక్ష్యంగా ఈ కార్యక్రమం నిర్వహించారు.
చెల్లించబడని డివిడెండ్లు, క్లెయిమ్ చేయబడని షేర్లను రీక్లెయిమ్ చేసుకునేందుకు, ఇన్వెస్టర్లకు తోడ్పాటు అందించడంపై నివేశక్ శివిర్ దృష్టి పెట్టింది. బీఎస్ఈ, ఎన్ఎస్ఈ, ఎన్ఎస్‌డీఎల్‌లాంటి దిగ్గజ మార్కెట్ ఇన్‌ఫ్రా సంస్థలతో (ఎంఐఐ) పాటు కేఫిన్ టెక్నాలజీస్ లిమిటెడ్, బిగ్‌షేర్ సర్వీసెస్ ప్రైవేట్ లిమిటెడ్, పూర్వా షేరిజిస్ట్రీ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్, MUFG ఇన్ఫోలైన్ ప్రైవేట్ లిమిటెడ్ సహకారంతో ఈ శిబిరం నిర్వహించబడింది.
సమగ్రమైన సహకారాన్ని అందించేందుకు ఈ కార్యక్రమంలో ప్రత్యేకంగా 23 సర్వీస్ డెస్కులు ఏర్పాటు చేశారు.
వీటి ద్వారా..ఆరేళ్లుగా క్లెయిమ్ చేయబడకుండా ఉన్న డివిడెండ్లు, షేర్లను క్లెయిమ్ చేయడం.
•అప్పటికప్పుడు కేవైసీ, నామినేషన్ వివరాలను ఆన్-ది-స్పాట్ అప్‌డేట్ చేయడం
•క్లెయిమ్-సంబంధ సందేహాలను సత్వరం పరిష్కరించడం;
•IEPFAకి సమర్పించిన పెండింగ్ క్లెయమ్‌లను ప్రాసెస్ చేయడం వంటి పనులను చేయబడతాయి.