Buying Gold | ప్రస్తుతం బంగారం కొనాలా? వద్దా?

బంగారం ధర ప్రస్తుతం 24 కారెట్లకు పది గ్రాముల ధర రూ. 81000 పైనే ఉంది. మరి ఈ ధర దరిదాపుల్లో బంగారం కొనాలా? వద్దా? అనేది ఇప్పుడు భారతీయుల మదిలో మెదులుతున్న బంగారం లాంటి ప్రశ్న.

Buying Gold | ప్రస్తుతం బంగారం కొనాలా? వద్దా?

Buying Gold – బంగారం, పుత్తడి, స్వర్ణం, హేమం… పేర్లెన్నైనా బంగారం భారతీయులకు ఎంతో ప్రియమైన లోహం. మహిళలకు బంగారు నగలంటే(Ornaments) ఉన్న పిచ్చి అభిమానం సామాన్యమైంది కాదు. సరే.. ధరించకపోయినా, బీరువాలోనే ఉన్నా, లాకర్​లో ఉన్నా, బంగారం మాత్రం ఉండితీరాల్సిందేనన్నది సగటు భారతీయ మహిళ మనోగతం. ధర రాకెట్​లా దూసుకుపోతున్నా, అయ్యో.. పోయినేడాది కొనకపోయామే అని బాధపడి, మళ్లీ కొనేందుకే సిద్ధమవుతారు. ప్రస్తుతం 80వేల పైనే ఉన్నా, కొనడమే మంచిదని నిపుణుల సలహా. ప్రపంచవ్యాప్తంగా కొనసాగుతున్న వాణిజ్యపరమైన ఒడిదొడుకులు(Economical factors) ఇందుకు దోహదం చేస్తాయని వారి అంచనా. గతేడాది ఇదే సమయంలో ఉన్న ధర కంటే ఇప్పుడు 30శాతం(30% surge) పెరిగింది. అయినా కూడా బంగారంపై పెట్టుబడి మంచిదేనంటున్నారు బంగారం వ్యాపార ఉద్ధండులు.

బంగారంపై పెట్టుబడి ఏ రూపంలో ఉన్నా, అంటే, నిజం బంగారం(Pysical Gold), ఈటీఎఫ్​(ETFs)లు, డిజిటల్​ గోల్డ్(Digital Gold)​… దేన్లోనైనా పెట్టుబడి పెట్టడం ప్రస్తుతం చాలా మంచిదన్నది నిపుణులు చెబుతున్న మాట. దీపావళి(Diwali) తర్వాత కొంతమేరకు తగ్గుదల(Decline) కనిపించినా, మళ్లీ పుంజుకుని వచ్చే దీపావళి నాటికి దాదాపు 87వేల నుండి 90వేల దాకా పెరగొచ్చని అంచనా ఉంది. రాబోయే తగ్గుదలప్పుడు కొని పెట్టుకుంటే బెటర్​ అంటున్నారు. అయితే తక్కువ కాలానికి పెట్టే పెట్టుబడి విషయంలో జాగ్రత్త అవసరం. కనీసం ఏడాది చూడగలిగినవారే కొనడం ఉత్తమం. ఇక వివాహం లాంటి శుభకార్యాలున్నప్పుడు ధరలు చూసే పరిస్థితి ఎలాగూ ఉండదు.

ఎకనామిక్​ టైమ్స్(ET)​ నివేదిక ప్రకారం, తులం బంగారం ధర 75,500 నుండి 76వేలకు దిగినప్పుడు కొనాల్సిందిగా నిపుణులు సిఫారసు చేస్తున్నారు. అందుకు ఇప్పటినుండే ప్రిపేర్​ కావడం బెటర్​ అని వారి సలహా. ప్రపంచవ్యాప్తంగా రాజకీయ, భౌగోళిక, ఆర్థిక ఒడిదొడుకులు(Geopolitical and economic uncertainties), అమెరికా ఎన్నికలు(US election), పశ్చిమ దేశా కేంద్ర బ్యాంకుల ఆర్థిక విధానాలు(monetary policy by western central bankers) బంగారం రేటు పెరుగుదలకు దోహదపడతాయని హెచ్​డిఎఫ్​సి సెక్యూరిటీస్(HDFC Securities)​ నుండి అనుజ్​ గుప్తా అభిప్రాయపడ్డారు. అయితే రాబోయే కొద్ది నెలలపాటు ధరలు తగ్గుముఖం పట్టే అవకాశముంది కాబట్టి, తక్కువ కాలపు పెట్టుబడులు(short-term investments) ఇబ్బందిపడతాయి. దీన్ని గుర్తుపెట్టుకుని మదుపరులు జాగ్రత్తగా వ్యవహరించాల్సిఉంటుంది.

గోల్డ్​ ఈటీఎఫ్​(Gold ETFs)లు ఈ మధ్య బాగా ప్రాచుర్యంలోకి వచ్చాయి. నాలుగైదేళ్లుగా వాటి పనితీరు చాలా బాగుంది. మదుపరులు కూడా మ్యూచువల్​ఫండ్ల(Mutual Funds) ద్వారా ఈటీఎఫ్​లలో పెట్టుబడి పెట్టడానికి మొగ్గుచూపుతున్నారు. ఈటీఎఫ్​లలో ఉన్న సౌలభ్యాలు, రక్షణ సౌకర్యాలు ఇందుకు(high purity, secure storage, full insurance) దోహదపడుతున్నాయి. అలాగే గోల్డ్​ సిప్​లు (Gold SIPs) ఇవి కూడా మెరుగ్గానే ఉన్నాయి. కాకపోతే ఎస్​జీబీలు(SGB – Soverign Gold Bonds)) మాత్రం ప్రస్తుతం సరిగ్గా పనితీరును ప్రదర్శించడంలేదనే వాదన బలంగా వినిపిస్తోంది. కాబట్టి మదుపు చేసేప్పుడు కొద్దినెలలు ఈ ఎస్​జీబీలను పక్కనబెట్టడం మంచిదని విశ్లేషకులు సూచిస్తున్నారు.