Silver, Gold Price| దిగొచ్చిన వెండి, బంగారం ధరలు
సరికొత్త రికార్డుల పెరుగుదల నమోదు చేస్తూ దూసుకపోతున్న వెండి, బంగారం ధరలు సోమవారం శాంతించి తగ్గుముఖం పట్టాయి. వెండి కిలో ధర రూ. 4000తగ్గి..రూ.2,81,000వద్ధ నిలిచింది. 24క్యారెట్ల 10గ్రాముల బంగారం ధర రూ.710 తగ్గి...రూ.1,42,240వద్ద నిలిచింది.
విధాత, హైదరాబాద్ : సరికొత్త రికార్డుల పెరుగుదల నమోదు చేస్తూ దూసుకపోతున్న వెండి, బంగారం ధరలు(Silver, Gold Price) సోమవారం శాంతించి(falls unexpectedly) తగ్గుముఖం పట్టాయి. వెండి కిలో ధర రూ. 4000తగ్గి..రూ.2,81,000వద్ధ నిలిచింది. నెల రోజుల వ్యవధిలో వెండి ఇంతగా తగ్గడం ఇదే తొలిసారి. అయితే వెండి ధరల తగ్గుదల తాత్కాలికమేనని..మళ్లీ ధరలు పెరిగి త్వరలోనే రూ.3లక్షల మార్కుకు చేరుతుందంటున్నారు నిపుణులు.
తగ్గిన బంగారం ధరలు
వెండి దారిలోనే బంగారం ధరలు కూడా తగ్గుదల నమోదు చేశాయి. సోమవారం 24క్యారెట్ల 10గ్రాముల బంగారం ధర రూ.710 తగ్గి…రూ.1,42,240వద్ద నిలిచింది. 22క్యారెట్ల 10గ్రాముల బంగారం ధర రూ. 650తగ్గి రూ.1,30,550వద్ద కొనసాగుతుంది. డిసెంబర్ నెలంతా పెరుగుతూ వచ్చిన పసిడి ధర అనూహ్యంగా తగ్గుదలను నమోదు చేసింది. డాలర్ విలువలో మార్పులు, అమెరికా ఆర్థిక, రాజకీయ నిర్ణయాలు, లోహాలపై పెట్టుబడులు పెరుగడం..పారిశ్రామిక అవసరాల నేపథ్యంలో బంగారం, వెండి ధరలు మళ్లీ పెరుగుతాయని నిపుణులు అంచనా వేస్తున్నారు.
X
Google News
Facebook
Instagram
Youtube
Telegram