Gold, Silver Price Increas| వెండి జోరు.. 24రోజుల్లో రూ.1లక్ష 4వేలు పెరుగుదల
వెండి, బంగారం ధరలు రికార్డు పెరుగుదలను నమోదు చేస్తూ దూసుకుపోతున్నాయి. శనివారం 24క్యారెట్ల 10గ్రాముల బంగారం ధర రూ.1,470పెరిగి.. రూ.1,58,620కి చేరింది. కిలో వెండి ధర రూ.100పెరిగి రూ.3,60,100కు చేరింది.
విధాత: వెండి, బంగారం ధరలు రికార్డు పెరుగుదలను నమోదు చేస్తూ దూసుకుపోతున్నాయి. శనివారం 24క్యారెట్ల 10గ్రాముల బంగారం ధర రూ.1,470పెరిగి.. రూ.1,58,620కి చేరింది. 22క్యారెట్ల 10గ్రాముల బంగారం ధర రూ.1,350పెరిగి రూ.1,45,500వద్ద నిలిచింది. అంతర్జాతీయంగా అమెరికా అధ్యక్షుడు ట్రంప్ నిర్ణయాలతో నెలకొన్న ఆర్థిక మార్పులు, డాలర్ బలహీనత, ఇరాన్, గ్రీన్ ల్యాండ్ లపై నెలకొన్న ఉద్రిక్తతలు వంటి పరిణామాలు, ఫెడరల్ వడ్డీ రేట్లు వంటి అంశాలు బంగారం, వెండి ధరలను తీవ్రంగా ప్రభావితం చేస్తున్నాయి.
బంగారం త్వరలోనే రూ.1,70,000పెరుగనుందని నిపుణులు అంచనా వేస్తున్నారు. 2025 జనవరి 24న రూ.82,420గా ఉండటం గమనార్హం. ఏడాదిలో తులం బంగారం ధర రూ.76,200పెరిగింది.
24రోజుల్లో లక్ష పెరిగిన వెండి ధర
వెండి ధరలు స్వల్పంగా శనివారం స్వల్పంగా పెరిగాయి. కిలో వెండి ధర రూ.100పెరిగి రూ.3,60,100కు చేరింది. 2026 జనవరి 1న రూ. 2,56,000గా ఉన్న కిలో వెండి ధర శనివారం జనవరి 24వ తేదీకి రూ.1,04,100పెరిగి రూ.3,60,100కు చేరుకోవడం వెండి ధరల దూకుడుకు నిదర్శనం.
2025జనవరి 25న కిలో వెండి ధర రూ.1,05,000గా ఉంది. ఏడాదిలో రూ.2,55,100పెరిగింది. అంతర్జాతీయ పరిణామాలు, వెండికి పారిశ్రామికంగా పెరిగిన డిమాండ్, ఉత్పత్తి, సరఫరాల మధ్య వ్యత్యాసం వంటి అంశాలు వెండి ధరల పెరుగుదలకు కారణమవుతున్నాయి. త్వరలోనే వెండి రూ.4లక్షలకు చేరనుందని మార్కెట్ నిపుణులు అంచనా వేస్తున్నారు.
X
Google News
Facebook
Instagram
Youtube
Telegram