GDP | జీడీపీ అంటే ఏంటి..? ఆర్ధిక వ్యవస్థకు ఎందుకు కీలకం..?
GDP | జీడీపీ అంటే ఏంటి? దేశ ఆర్ధిక వ్యవస్థ అభివృద్దికి జీడీపీ( GDP ) ఎలా కీలకం? జీడీపీని ఎలా లెక్కిస్తారు? జీడీపీ వల్ల ఉపయోగం ఏంటి? జీడీపీకి దేశ ఆర్ధిక వ్యవస్థ( Financial System ) కు ఉన్న సంబంధం ఏంటి? జీడీపీపై ఏయే అంశాలు ప్రభావం చూపుతాయో తెలుసుకుందాం.
GDP | జీడీపీ అంటే ఏంటి? దేశ ఆర్ధిక వ్యవస్థ అభివృద్దికి జీడీపీ( GDP ) ఎలా కీలకం? జీడీపీని ఎలా లెక్కిస్తారు? జీడీపీ వల్ల ఉపయోగం ఏంటి? జీడీపీకి దేశ ఆర్ధిక వ్యవస్థ( Financial System ) కు ఉన్న సంబంధం ఏంటి? జీడీపీపై ఏయే అంశాలు ప్రభావం చూపుతాయో తెలుసుకుందాం.
జీడీపీ ఎందుకు?
జీడీపీ అంటే గ్రాస్ డొమెస్టిక్ ప్రొడక్ట్( Gross Domestic Product ) అంటారు. ఇంకా వివరంగా చెప్పాలంటే ఒక దేశంలో ఒక ఏడాది కాలంలో అమ్ముడైన మొత్తం వస్తువు, సేవల విలువను ఆ దేశ జీడీపీగా పరిగణిస్తారు. సామాన్యుడికి అర్ధమయ్యేలా వి చెప్పాలంటే ఏదైనా ఒక దుకాణంలో ఆ ఏడాది అమ్మిన వస్తువుల విలువ రూ. 1000 అనుకుందాం. అదే ఆ షాపు జీడీపీ. అలానే ఆ దేశంలో ఆ ఏడాది అమ్మిన వస్తువుల విలువే ఆ దేశ జీడీపీ అవుతుంది. అయితే ఇతర దేశాలకు చెందిన వస్తువుల విక్రయాల విలువను ఇందులో లెక్కించరు. కేవలం దేశంలో తయారైన వస్తువుల విక్రయాలనే జీడీపీలో లెక్కిస్తారు. దేశ ఆర్ధిక వ్యవస్థ పరిమాణాన్ని కొలవడానికి ఉపయోగించే ముఖ్యమైన సూచిక. జీడీపీని సాధారణంగా ఏడాదికి లేదా మూడు నెలలకు ఓసారి లెక్కిస్తారు. ఒక దేశం అభివృద్దిని అంచనా వేయడానికి జీడీపీ సహాయపడుతుంది.
జీడీపీలో ఎన్ని రకాలు?
జీడీపీని ఐదు రకాలుగా విభజించారు. నామమాత్రపు జీడీపీ, వాస్తవ జీడీపీ, తలసరి జీడీపీ, పీపీపీ జీడీపీ, తలసరి జీడీపీగా విభజించారు.
నామమాత్రపు జీడీపీ: ప్రస్తుత మార్కెట్ ధరల ఆధారంగా లెక్కిస్తారు. ద్రవ్యోల్బణం ప్రభావం ఇందులో ఉంటుంది. ఇది ఆర్థిక వ్యవస్థ వృద్ధిని అధికంగా చూపించవచ్చు. దీన్ని లెక్కించడం సులభం. కానీ ద్రవ్యోల్బణం కారణంగా తప్పుదారి పట్టించవచ్చు.
వాస్తవ జీడీపీ: ఇది ద్రవ్యోల్బణం ప్రభావాలను తొలగించి స్థిరమైన ధరల ఆధారంగా లెక్కిస్తారు. ఆర్థిక వ్యవస్థ వృద్ధిని అర్థం చేసుకోవడానికి ఇది ఉపయోగపడుతుంది. వివరంగా చెప్పాలంటే స్థిర మూల సంవత్సరం నుండి ధరలను ఉపయోగించి ద్రవ్యోల్బణం కోసం సర్దుబాటు చేసిన మొత్తం విలువ.
తలసరి జీడీపీ: సగటు ఆర్థిక జీవన ప్రమాణం గురించి ఒక ఆలోచనను ఇస్తుంది.జనాభా+ మొత్తం జీడీపీని విభజిస్తే వచ్చేదే తలసరి జీడీపీ. దీని ద్వారా సగటు ఆదాయం తెలుసుకోవచ్చు.
పీపీపీ జీడీపీ: దేశాలలో కొనుగోలు శక్తి (జీవన వ్యయం)లో తేడాల కోసం జీడీపీని సర్దుబాటు చేస్తారు. వివిధ దేశాల మధ్య ఆర్థిక ఉత్పత్తిని మరింత సహేతుకంగా పోల్చడానికి వీలు కల్పిస్తుంది.వివిధ దేశాల కరెన్సీల కొనుగోలు శక్తిని పోల్చడానికి ఇది సహాయపడుతుంది.
జీడీపీని ఎలా లెక్కిస్తారు?
జీడీపీని లెక్కించడానికి కొన్ని పద్దతులను అనుసరిస్తారు. వినిమయ వ్యయం, ప్రభుత్వ వ్యయం, పెట్టుబడి వ్యయం, నికర ఎగుమతుల విలువ ఆధారంగా జీడీపీని లెక్కిస్తారు. దేశంలోని జనాభా కొనుగోలు చేసిన వస్తువులు, సేవల వినియోగానికి చేసిన ఖర్చును పరిగణనలోకి తీసుకుంటారు. ఉదహరణకు ఒక కుటుంబం వినోదం, ఆహారం, బట్టల కోసం చేసిన ఖర్చు అంచనా తీస్తారు.ఇక పెట్టుబడి వ్యయం అంటే వ్యాపారం, పరికరాలు, భవనాల నిర్మాణం వంటి వాటికోసం చేసిన ఖర్చును అంచనా వేస్తారు. మౌలిక వసతులు, ప్రజల కోసం అవసరమైన సౌకర్యాల కల్పన కోసం ప్రభుత్వం చేసిన ఖర్చును ప్రభుత్వ వ్యయం అంచనా వేస్తారు. దేశం నుంచి విదేశాలకు ఎగుమతులు అయిన సరుకులు, వస్తువుల విలువ, ఇతర దేశాల నుంచి దిగుమతి చేసుకున్న వస్తువుల విలువ మధ్య తేడా అంచనా వేస్తారు. ఈ నాలుగు అంశాల ఆధారంగా దేశ జీడీపీని లెక్కిస్తారు. దేశంలోని సెంట్రల్ స్టాటిస్టిక్స్ ఆఫీస్ ప్రతి ఏటా నాలుగు సార్లు జీడీపీని లెక్కిస్తుంది. ప్రతి మూడు నెలలకు ఓసారి జీడీపీ లెక్కలు తీస్తారు.
జీడీపీ ఏం సూచిస్తుంది?
ప్రతి ఏటా ఒక దేశ ఆర్ధిక వ్యవస్థ ఎలా ఉందో ఆ దేశ జీడీపీ సూచిస్తుంది. అంతకుముందు ఏడాదితో పోలిస్తే ఈ ఏడాది తగినన్ని సరుకులు, సేవల ఉత్పత్తి లేదని తేలితే ఆ దేశ ఆర్ధిక వ్యవస్త సరిగా లేనట్టు అంటే ఆర్ధిక వ్యవస్థ మందగమనంలో ఉన్నట్టుగా భావించాలి. ఆర్ధిక కార్యకలాపాలు బాగా ఉంటే జీడీపీ వృద్ది చెందుతోందని అర్ధం. ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలు క్షేత్రస్థాయిలో మంచి ఫలితాలు ఇస్తున్నాయని చెప్పవచ్చు. స్టాక్ మార్కెట్ లో పెట్టుబడులు పెట్టే మదుపరులు కూడా జీడీపీని పరిగణనలోకి తీసుకుంటారు. ఆర్ధిక వ్యవస్థ పురోగతిలో ఉంటే వ్యాపార సంస్థలు, పెట్టుబడిదారులు ఎక్కువ పెట్టుబడులు పెట్టడానికి ఆసక్తి చూపుతారు.
ఎనిమిది రంగాల నుంచి సేకరణ
జీడీపీ గణాంకాలను ప్రధానంగా ఎనిమిది రంగాల నుంచి సేకరిస్తారు. గనుల తవ్వకం, అడవులు, చేపల వేట, హోటల్, నిర్మాణం, వాణిజ్యం, సమాచార సంబంధాలు, బ్యాంకింగ్, బీమా, రియల్ ఏస్టేట్, సామాజిక, ప్రజాసేవలు, వ్యవసాయ రంగం, తయారీ రంగం, విద్యుత్, గ్యాస్ పంపిణీ రంగాల నుంచి జీడీపీ వివరాలు సేకరిస్తారు. ఆర్ధిక వ్యవస్థ పనితీరు ఎలా ఉందో అంచనా వేయడానికి జీడీపీని కొలమానంగా తీసుకుంటారు. ట్రెండ్ లను ట్రాక్ చేయడానికి కూడా జీడీపీ దోహదపడుతుంది. గతంలో జీడీపీ వృద్ది ఎలా ఉంది? ఇప్పుడు ఎలా ఉందో ట్రాక్ చేయవచ్చు.
జీడీపీ పరిమితులు ఏంటి?
జీడీపీకి కూడా పరిమితులున్నాయి. అనధికారిక, మార్కెటేతర కార్యకలాపాలు జీడీపీ గణాంకాల పరిదిలోకి రావు. ఇంటి పనులు, మార్కెట్ వెలుపల జరిగే కార్యకలాపాలు జీడీపీ లెక్కించదు. ఒక దేశంలో సంపద ఎంత సమానంగా పంపిణీ చేయబడిందో జీడీపీ ద్వారా తెలియదు. ఇది అధిక ఆదాయ అసమానతను దాచిపెడుతుంది.ఆరోగ్యం, విద్య, విశ్రాంతి వంటి అంశాలు ఆర్థిక శ్రేయస్సులో భాగమైనప్పటికీ వాటిని జీడీపీ పరిధిలోకి రాదు. సెకండ్ హ్యాండ్ వస్తువుల అమ్మకాలు కొత్త వస్తువుల ఉత్పత్తిని సూచించనందున, అవి కూడా జీడీపీ గణాంకాల్లోకి రావు.
X
Google News
Facebook
Instagram
Youtube
Telegram