Bank Loans | లోన్ కోసం ట్రై చేస్తున్నారా..? ఇక రుణం సులభమే..! ఆర్‌బీఐ కొత్త రూల్..!
Bank Loans | ఏదైనా అవసరం కోసం బ్యాంకులో లోన్ తీసుకోవాలని భావిస్తున్నారా? క్రెడ అయితే మీకో గుడ్‌న్యూస్. ఇటీవల ఆర్‌బీఐ బ్యాంకులకు కీలక ఆదేశాలు జారీ చేసింది. వాస్తవానికి బ్యాంకులు క్రెడిట్ స్కోర్ ఆధారంగానే రుణాలు జారీ చేస్తుంటాయి.

Bank Loans | ఏదైనా అవసరం కోసం బ్యాంకులో లోన్ తీసుకోవాలని భావిస్తున్నారా? క్రెడ అయితే మీకో గుడ్‌న్యూస్. ఇటీవల ఆర్‌బీఐ బ్యాంకులకు కీలక ఆదేశాలు జారీ చేసింది. వాస్తవానికి బ్యాంకులు క్రెడిట్ స్కోర్ ఆధారంగానే రుణాలు జారీ చేస్తుంటాయి. క్రెడిట్ స్కోర్, సిబిల్ కంపెనీలు ఇచ్చే నివేదికల ఆధారంగా రుణాలు మంజూరు అవుతుంటాయి. ఇటీవల ఆర్‌బీఐ బ్యాంకులు, క్రెడిట్ ఇన్ఫర్మేషన్ కంపెనీలు ప్రతి 15రోజులకోసారి తమ వినియోగదారుల క్రెడిట్ రిపోర్టులను అప్‌డేట్ చేయాలని ఆదేశించింది. దాంతో బ్యాంకులో లోన్ తీసుకోవాలనుకునే వారికి ఈ నిర్ణయం ఎంతో ఉపయోగపడనున్నది. గతంలో బ్యాంకులు, క్రెడిట్ ఇన్ఫర్మేషన్ కంపెనీలు నెలకోసారి క్రెడిట్ నివేదికను అప్‌డేట్ వచ్చేవి.
15 రోజులకు ఒకసారి క్రెడిట్ రిపోర్టును అప్‌డేట్ చేయడం ద్వారా బ్యాంకు అకౌంట్స్, క్రెడిట్ కార్డులు కలిగిన వ్యక్తులకు ప్లస్ పాయింట్ అవుతుంది. ఉదాహరణకు ఒక వ్యక్తి అప్పు తీసుకొని మళ్లీ చెల్లించినా తిరిగి క్రెడిట్ స్కోర్ అప్‌డేట్ అయ్యేందుకు ఇప్పటివరకు దాదాపు నెలరోజుల సమయం పడుతుంది. ఇకపై 15 రోజుల్లో ఆ సమాచారాన్ని బ్యాంకులు, క్రెడిట్ ఇన్ఫర్మేషన్ బ్యూరోలు అప్‌డేట్ చేయనున్నాయి. దాంతో నిజాయితీ కలిగిన కస్టమర్లకు ప్రయోజనం కలుగనున్నది. అదే సమయంలో ఆర్థిక క్రమశిక్షణ లేని వారి అసలు ముఖాలు బయటపడే అవకాశం ఉంటుంది. వాస్తవానికి ప్రస్తుతం 750 కంటే ఎక్కువ సిబిల్ స్కోర్ ఉన్నవారికి మాత్రమే బ్యాంకులు సులభంగా రుణాలు మంజూరు చేస్తున్నాయి. ఇలాంటి వాళ్లకు ఇచ్చే లోన్లపై వడ్డీరేటు కూడా చాలా తక్కువగానే ఉంటుంది. కొంతమందికి 600 కంటే తక్కువ సిబిల్ ఉంటుండగా.. వారికి రుణాలను ఇచ్చేందుకు బ్యాంకులు ఆసక్తి చూపించవు. లోన్ మంజూరు చేసిన వడ్డీని అధికంగా వసూలు చేసే అవకాశం ఉంటుంది.