WhatsApp | గ్రూప్‌ డిస్క్రిప్షన్‌ ఫీచర్‌ తెస్తున్న వాట్సాప్‌.. జాయిన్‌ అయ్యే ముందే వివరాలన్నీ తెలుసుకోవచ్చు..!

WhatsApp | మెటా యాజమాన్యంలోని మెసేజింగ్‌ ప్లాట్‌ ఫామ్‌ (WhatsApp) ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది వినియోగదారులు వినియోగిస్తున్నారు. యూజర్ల నుంచి వచ్చిన ఫీడ్‌బ్యాక్‌, అవసరాలకు అనుగుణంగా ఛాటింగ్‌ అనుభవాన్ని మెరుగుపరిచేందుకు యాప్‌లో ఎప్పటికప్పుడు సరికొత్త ఫీచర్స్‌ను తీసుకువస్తుంది.

WhatsApp | గ్రూప్‌ డిస్క్రిప్షన్‌ ఫీచర్‌ తెస్తున్న వాట్సాప్‌.. జాయిన్‌ అయ్యే ముందే వివరాలన్నీ తెలుసుకోవచ్చు..!

WhatsApp | మెటా యాజమాన్యంలోని మెసేజింగ్‌ ప్లాట్‌ ఫామ్‌ (WhatsApp) ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది వినియోగదారులు వినియోగిస్తున్నారు. యూజర్ల నుంచి వచ్చిన ఫీడ్‌బ్యాక్‌, అవసరాలకు అనుగుణంగా ఛాటింగ్‌ అనుభవాన్ని మెరుగుపరిచేందుకు యాప్‌లో ఎప్పటికప్పుడు సరికొత్త ఫీచర్స్‌ను తీసుకువస్తుంది. ఇప్పటికే వాట్సాప్‌లో కమ్యూనిటీ ఫీచర్స్‌ తీసుకువచ్చిన విషయం తెలిసిందే. అయితే, యూజర్లు ఆ గ్రూప్‌లో చేరే ముందే దాని గురించి పూర్తి సమాచారం తెలుసుకోవచ్చు. ఇందు కోసం గ్రూప్‌ డిస్క్రిప్షన్‌ (Group Description) ఫీచర్‌ను తీసుకురానున్నది.

వాట్సాప్‌కు సంబంధించిన ఫీచర్స్‌, అప్‌డేట్స్‌కు సంబంధించిన సమాచారాన్ని అందించే WABetaInfo తెలిపింది. కమ్యూనిటీ గ్రూప్స్‌ కోసం గ్రూప్ డిస్క్రిప్షన్ ఫీచర్స్‌ను వాట్సాప్‌ తీసుకురాబోతుందని తెలిపింది. త్వరలోనే అందుబాటులోకి రాబోతుందని పేర్కొంది. ఈ గ్రూప్‌ డిస్క్రిప్షన్‌ iOS వెర్షన్ 24.16.75 కనిపించిందని వాబీటాఇన్ఫో పేర్కొంది. వాస్తవానికి గ్రూప్‌లో ఎవరైనా కొత్తగా చేరిన సమయంలో గ్రూప్‌ నినాదం, దేని కోసం గ్రూప్‌ని తీసుకువచ్చారో తెలుసుకోవడం సాధ్యం కాదు. అయితే, ఈ కొత్త ఫీచర్‌తో గ్రూప్‌లోకి యాడ్‌ చేసే ముందు గ్రూప్‌ని ఎందుకు క్రియేట్‌ చేశారు..? గ్రూప్‌లో చేరడం వల్ల ఎలాంటి ప్రయోజనం ఉంటుందో తెలియదు. అలాగే యాడ్‌ చేస్తున్న వ్యక్తి గ్రూప్‌లోకి తనను ఎందుకు జోడిస్తున్నాడో.. అతని ఉద్దేశం ఏంటో తెలిసేందుకు అవకాశం లేదు. అయితే, గ్రూప్‌ డిస్క్రిప్షన్‌ ద్వారా గ్రూప్‌లో చేరే ముందే యూజర్లు వివరాలన్నీ తెలుసుకొని గ్రూప్‌లో చేరవచ్చా? లేదా? అనే నిర్ణయం తీసుకునే అవకాశం ఉంటుంది.

ప్రస్తుతం ఐఓఎస్‌ వెర్షన్‌లో అందుబాటులో ఉన్నది. కొద్దివారాల్లోనూ ఐఫోన్‌ యూజర్లు వెర్షన్ 24.16.75 అప్‌డేట్‌ చేసుకుంటే ఈ ఫీచర్‌ కనిపిస్తుంది. ప్రస్తుతం ట్రయల్ష్ దశలో ఉన్నది. ఆ తర్వాత ఐఓఎస్‌, ఆండ్రాయిడ్‌ యూజర్లందరికీ అందుబాటులోకి వచ్చే అవకాశం ఉన్నది. ఇదిలా ఉండగా.. వాట్సాప్‌ మరో ఫీచర్‌పై సైతం పని చేస్తున్నది. యూజర్లు యానిమేటెడ్‌ అవతార్స్‌ ప్రొఫైల్‌ స్క్రీన్‌పై సైతం కనిపించనున్నారు. యూజర్లు సొంతంగా అవతార్‌ను సృష్టించి.. ఇతర మెటా సర్వీసెస్‌లోని స్టిక్కర్స్‌లను సృష్టించే అవకాశం సైతం ఉంటుంది. బీటా వెర్షన్‌లో వీటిని టెస్ట్‌ చేస్తున్నది.