టాలీవుడ్ రేసులో భాగ్యశ్రీ బోర్సే స్పీడ్

విధాత : అందం..అభినయం కలబోసినట్లుగా కనిపించే మరాఠి బొమ్మ భాగ్యశ్రీ బోర్సే(Bhagyashri Borse) టాలీవుడ్ లో వరుస ఛాన్స్ లు కొట్టేస్తుంది. మోడలింగ్ నుంచి సినీ పరిశ్రమకు పరిఛయమైన భాగ్యశ్రీ బోర్సే గత ఏడాది రవితేజ హీరోగా హరీష్ శంకర్ దర్శకత్వంలో వచ్చిన ‘మిస్టర్ బచ్చన్’(Mr. Bachchan) సినిమాలతో తెలుగు చిత్ర పరిశ్రమలో ఎంట్రీ ఇచ్చింది. అయితే తొలి సినిమా భారీ డిజాస్టర్ అయినప్పటికి భాగ్యశ్రీ బోర్సే కేరీర్(Bhagyashri Borse) కు ఢోకా లేకుండా పోయింది. తొలి సినిమాతో కుర్రాళ్ల గుండెల్లో గిలిగింతలు పెట్టిన లక్ స్టార్ భాగ్యశ్రీ భోర్సేకు ప్రస్తుతం టాలీవుడ్ లో వరుస అవకాశాలు దక్కుతున్నాయి. విజయ్ దేవరకొండ(Vijay deaverakonda) సరసన ‘కింగ్‌డమ్’, రామ్(Ram Pothineni) సరసన ‘ఆంధ్రా కింగ్ తాలూకా’లో ఆమె హీరోయిన్‌గా నటిస్తుంది. మలయాళీ స్టార్ హీరో దుల్కర్ సల్మాన్(Dulquer Salmaan) సరసన ‘కాంత’ చిత్రంలోనూ భాగ్యశ్రీ హీరోయిన్.

ప్రస్తుతం ఈ అమ్మడు చేతిలో ఉన్న ఈ మూడు సినిమాలతో ఏడాది అంతా తన అభిమానులను అలరించబోతుంది. తాజాగా భాగ్యశ్రీ ఖాతాలోకి మరో క్రేజీ ప్రాజెక్టు చేరినట్లు వార్తలు వస్తున్నాయి. నేచురల్ స్టార్ నానితో ‘దసరా’ తర్వాత శ్రీకాంత్ ఓదెల రూపొందిస్తున్న ‘ది ప్యారడైజ్’పై భారీ అంచనాలున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రం హీరోయిన్ రేసులో భాగ్యశ్రీ పేరు ప్రధానంగా చర్చలో ఉందని ఇండస్ట్రీ టాక్. నిర్మాణంలో ఉన్న వాటిలో ఏ ఒక్కటి హిట్ అయినా భాగ్యశ్రీ కెరీర్ మరింత స్పీడ్ అందుకోనుంది.