Rajendra Prasad | నటుడు రాజేంద్ర ప్రసాద్ ఇంట తీవ్ర విషాదం.. గుండెపోటుతో కుమార్తె మృతి
Rajendra Prasad | తెలుగు చలనచిత్ర పరిశ్రమ రంగం( Telugu Film Industry )లో విషాదం నెలకొంది. నటుడు రాజేంద్ర ప్రసాద్( Rajendra Prasad ) కుమార్తె గాయత్రి( Gayathri ) గుండెపోటుతో కన్నుమూశారు.

Rajendra Prasad | టాలీవుడ్( Tollywood ) ప్రముఖ నటుడు రాజేంద్ర ప్రసాద్( Rajendra Prasad ) ఇంట్లో విషాద ఛాయలు అలుముకున్నాయి. రాజేంద్ర ప్రసాద్ కుమార్తె గాయత్రి( Gayathri ) (38) శనివారం తెల్లవారుజామున కన్నుమూశారు. గాయత్రికి శుక్రవారం రాత్రి గుండెపోటు రావడంతో హుటాహుటిన హైదరాబాద్‌లోని ఏఐజీ ఆస్పత్రికి( AIG Hospital ) తరలించారు. ఆమె ఆస్పత్రిలో చికిత్స పొందుతూ శనివారం తెల్లవారుజామున తుదిశ్వాస విడిచారు. దీంతో రాజేంద్ర ప్రసాద్‌తో పాటు కుటుంబ సభ్యులు తీవ్ర శోకసంద్రంలో మునిగిపోయారు.
గాయత్రి మృతిపట్ల సినీ, రాజకీయ ప్రముఖులు సంతాపం ప్రకటిస్తున్నారు. రాజేంద్ర ప్రసాద్ కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలుపుతున్నారు. రాజేంద్ర ప్రసాద్‌కు ధైర్యం చెబుతున్నారు.
రాజేంద్ర ప్రసాద్‌కు ఒక కుమారుడు, కుమార్తె ఉన్నారు. కుమార్తె గాయత్రిది ప్రేమ వివాహం( Love Marriage ) అని తెలిసింది. ఇటీవల నిర్వహించిన ఓ ఆడియో రిలీజ్ ఫంక్షన్‌లో రాజేంద్రప్రసాద్ మాట్లాడుతూ.. అమ్మ లేని వారు కూతురిలో వారి అమ్మను చూసుకుంటారని తెలిపారు. తన పదేళ్ల వయసులోనే తన తల్లి చనిపోయారని, అందుకే తాను కూడా తన కూతురిలో అమ్మను చూసుకున్నానని చెప్పుకొచ్చారు. కూతురు సెంటిమెంట్‌తో వచ్చిన తల్లి తల్లి నా చిట్టి తల్లి అనే పాట తనకెంతో ఇష్టమన్నారు. ఆ పాటను గాయత్రికి ఎన్నోసార్లు వినిపించినట్లు రాజేంద్ర ప్రసాద్ గుర్తు చేశారు.