Farewell Party | వీడ్కోలు పార్టీలో మాట్లాడుతూ.. స్టేజీ పైనే కుప్పకూలిన విద్యార్థిని! వీడియో వైరల్

Farewell Party | మొన్న మ్యారేజ్ డేలో డ్యాన్స్ చేస్తూ ఓ వ్యక్తి గుండెపోటు( Heart Stroke )తో కుప్పకూలిపోయాడు.. నిన్న ఓ యువకుడు క్రికెట్ ఆడుతూ గ్రౌండ్‌లోనే కుప్పకూలి ప్రాణాలొదిలాడు.. తాజాగా ఓ యువతి వీడ్కోల్ పార్టీ( Farewell Party )లో స్టేజీపై మాట్లాడుతూ.. అందర్నీ నవ్విస్తూనే సొమ్మసిల్లి పడిపోయి.. ఊపిరి వదిలింది.
వివరాల్లోకి వెళ్తే.. మహారాష్ట్ర( Maharashtra ) ధరష్వి జిల్లా( Dharashiv district )లోని ఆర్‌జీ షిండే కాలేజీ( RG Shinde College )లో ఇటీవలే వీడ్కోలు సమావేశం నిర్వహించారు. ఇక పార్టీ సందర్భంగా విద్యార్థినులు తమ అనుభావాలను వేదికపై పంచుకుంటున్నారు. వర్ష ఖరత్( Varsha Kharrat ) అనే విద్యార్థిని కూడా స్టేజీపైకి వెళ్లి ప్రసంగించడం ప్రారంభించింది. తన ప్రసంగంతో అందర్నీ నవ్వించింది కూడా.. ఇక మరుక్షణమే.. అదే వేదికపై అందరూ చూస్తుండగానే వర్ష సొమ్మసిల్లి పడిపోయింది.
అప్రమత్తమైన కాలేజీ ఫ్యాకల్టీ, తోటి విద్యార్థినులు బాధితురాలు వర్షను ఆస్పత్రికి తరలించారు. అప్పటికే ఆమె చనిపోయినట్లు వైద్యులు నిర్ధారించారు. అయితే వర్షకు ఎనిమిదేండ్ల వయసు ఉన్నప్పుడు గుండెకు సంబంధించిన సర్జరీ జరిగింది. గత 12 ఏండ్ల నుంచి ఆమె ఆరోగ్యంగానే ఉన్నారు. ఉన్నట్టుండి కాలేజీ వీడ్కోల్ సమావేశంలో కుప్పకూలిపోయి ప్రాణాలు వదలడం అందర్నీ కలవరపరిచింది. గుండెపోటు కారణంగానే వర్ష ప్రాణాలు కోల్పోయిందని వైద్యులు నిర్ధారించారు. వర్ష తల్లిదండ్రులు, ఫ్రెండ్స్ శోకసంద్రంలో మునిగిపోయారు.
At RG Shinde College in Dharashiv, Maharashtra, a student, Varsha Kharat, collapsed and died during her farewell speech pic.twitter.com/5is46m5Htz
— srk (@srk9484) April 7, 2025