Tejashwi Yadav | రఘోపూర్ నుంచి నామినేషన్ దాఖలు చేసిన తేజస్వి యాదవ్
ఆర్జేడీ నేత తేజస్వి యాదవ్ బుధవారం రఘోపూర్ అసెంబ్లీ స్థానం నుంచి నామినేషన్ దాఖలు చేశారు. లాలూ ప్రసాద్ యాదవ్, రబ్రీ దేవి వెంటరాగా, హాజీపూర్ కలెక్టరేట్‌లో నామినేషన్ పత్రాలు సమర్పించారు. ఇది ఆయనకు వరుసగా మూడోసారి నామినేషన్.

ఆర్ జే డీ నాయకుడు తేజస్వి యాదవ్ బుధవారం నాడు రఘోపూర్ అసెంబ్లీ స్థానం నుంచినామినేషన్ దాఖలు చేశారు. రఘోపూర్ నుంచి గతంలో లాలూ,రబ్రీదేవి ప్రాతినిథ్యం వహించారు. వైశాలి జిల్లా ప్రధాన కార్యాలయం హాజీపూర్ లోని కలెక్టరేట్ లో తేజస్వి యాదవ్ నామినేషన్లు ఎన్నికల అధికారికి అందించారు. లాలూ ప్రసాద్, రబ్రీదేవి వెంట రాగా తేజస్వి యాదవ్ నామినేషన్ పత్రాలు సమర్పించారు. మాజీ డిప్యూటీ సీఎం వెంట మాజీ డిప్యూటీ సీఎం వెంట పాటలీపుత్ర ఎంపీ, పెద్ద సోదరి మీసా భారతి, రాజ్యసభ సభ్యుడు సంజయ్ యాదవ్ వంటి పలువురు సన్నిహితులు, కుటుంబ సభ్యులు కూడా ఉన్నారు. తేజస్వి యాదవ్ తో ప్రయాణీస్తున్న కారుపై ఆర్జేడీ శ్రేణులు పూలవర్షం కురిపించారు. కారు దిగి నామినేషన్ పత్రాలు సమర్పించేందుకు వెళ్లే సమయంలో పార్టీ శ్రేణులు, ఆయన అభిమానులను ఆపేందుకు భద్రతా సిబ్బంది చాలా కష్టపడాల్సి వచ్చింది. రఘోపూర్ నుంచి తేజస్వియాదవ్ రెండుసార్లు వరుసగా గెలిచారు. ఈసారి గెలిస్తే ఆయన హ్యాట్రిక్ సాధిస్తారు. రాష్ట్రంలో ఇండియా కూటమి విజయం సాధిస్తోందని తేజస్వి యాదవ్ ధీమా వ్యక్తం చేశారు.