టీవీకే అధ్యక్షుడు విజయ్ పై కేసు నమోదు

తను విపరీతంగా అభిమానించే నటుడు టీవీకే అధ్యక్షుడు విజయ్ పై ఓ అభిమానినే కేసు పెట్టడం ఆసక్తి రేపింది. తీవ్ర మనస్తాపం చెందిన అభిమాని శరత్ పెరంబలూరు పోలీస్ స్టేషన్ లో విజయ్ పైన బౌన్సర్ల పైన ఫిర్యాదు చేశాడు

టీవీకే అధ్యక్షుడు విజయ్ పై కేసు నమోదు

విధాత: తను విపరీతంగా అభిమానించే నటుడు టీవీకే అధ్యక్షుడు విజయ్ పై ఓ అభిమానినే కేసు పెట్టడం ఆసక్తి రేపింది. టీవీకే పార్టీ రెండవ వార్షికోత్సవ సభలో ర్యాంప్ మీద నడుచుకుంటూ వెళ్తున్న విజయ్ ను కలవడానికి అభిమాని శరత్ ప్రయత్నించారు. ఆ సమయంలో బౌన్సర్లు అతనిని అడ్డుకొని కొట్టారు. ఇక్కడితో తీవ్ర మనస్తాపం చెందిన అభిమాని శరత్ పెరంబలూరు పోలీస్ స్టేషన్ లో విజయ్ పైన బౌన్సర్ల పైన ఫిర్యాదు చేశాడు.

దీంతో పోలీసులు విజయ్, బౌన్సర్లపై కేసు నమోదు నమోదు చేశారు. ఇదే సభలో తొక్కిసలాట చోటుచేసుకుని ఒకరు మృతి చెందడంతో పాటు 12 మందికి తీవ్ర గాయాలు అవ్వడం కూడా వివాదాస్పదమైంది.