Adah Sharma | సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ ఫ్లాట్‌లో ఏదో శక్తి ఉందంటూ.. సెన్సేషనల్ కామెంట్స్ చేసిన అదాశర్మ..!
Adah Sharma | బాలీవుడ్ నటి అదాశర్మ (Adah Sharma) వరుస చిత్రాలతో మంచి జోరుమీదున్నది. కేరళ స్టోరీ (The Kerala Story), బస్తర్ (Bastar) మూవీలతో మంచి క్రేజ్‌ను సంపాదించింది. అంతకు ముందు పలు సినిమాల్లో నటించినా పెద్దగా కలిసిరాలేదు. కానీ, ఈ రెండు చిత్రాలతో భారీ ఫాలోయింగ్‌ను సొంతం చేసుకున్నది.
Adah Sharma | బాలీవుడ్ నటి అదాశర్మ (Adah Sharma) వరుస చిత్రాలతో మంచి జోరుమీదున్నది. కేరళ స్టోరీ (The Kerala Story), బస్తర్ (Bastar) మూవీలతో మంచి క్రేజ్‌ను సంపాదించింది. అంతకు ముందు పలు సినిమాల్లో నటించినా పెద్దగా కలిసిరాలేదు. కానీ, ఈ రెండు చిత్రాలతో భారీ ఫాలోయింగ్‌ను సొంతం చేసుకున్నది. ఇక బ్యూటీ ఇటీవల ఫ్యామిలీతో కలిసి కొత్త ఫ్లాట్‌కు షిఫ్ట్ అయ్యింది. ఆ ప్లాట్ ఎవరిదో కాదు బాలీవుడ్ దివంగత యువ నటుడు సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ (Sushant Singh Rajput)ది. కొత్త ప్లాట్‌లోకి దిగాక కొద్దిరోజులు బాగానే అనిపించిందని.. కొద్దిరోజుల తర్వాత ఏదో వెరైటీగా అనిపిస్తూ వచ్చిందని బ్యూటీ ఓ ఇంటర్వ్యూలో తన అనుభవాన్ని పంచుకున్నది. దాంతో కొంత టెన్షన్‌కు గురయ్యానని చెప్పుకొచ్చింది. ఆ ప్లాట్‌లో ఏదో శక్తి ఉందని.. అలాగే, తమ లైఫ్‌లోనూ కొన్ని అనుకోని ఘటనలు జరిగాయని వెల్లడించింది. ప్రస్తుతం అదాశర్మ వ్యాఖ్యలు వైరల్‌గా మారాయి.
ఇదిలా ఉండగా.. అదాశర్మ ప్రస్తుతం ఉంటున్న ప్లాట్‌లో యువ నటుడు సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ నివాసం ఉన్నారు. అయితే, ఏవో కారణాలతో సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ ఆత్మహత్య చేసుకున్నారు. అయితే, ఆత్మహత్య కాదని.. హత్య అంటూ ఆరోపణలున్నాయి. సుశాంత్ సింగ్ చనిపోయి నాలుగేళ్లు దాటినా ఇప్పటికీ మరణం పెద్ద మిస్టరీగా ఉన్నది. కెరీర్ ప్రారంభంలో అవకాశాలు రావడంతో స్టార్ హీరోగా ఎదిగాడు. ఆ తర్వాత సినిమాల్లో అవకాశాలురాకపోవడంతో కుంగుబాటుకు లోనయ్యాడు. దాంతో 2020 జూన్ 14న ఆత్మహత్య చేసుకున్నాడు. దీనికి బాలీవుడ్‌లోని నెపోటిజమే కారణమని అప్పట్లో పెద్ద ఎత్తున విమర్శలు వ్యక్తమయ్యాయి. తన కొడుకుది ఆత్మహత్య కాదని.. హత్య అంటూ ఆయన తండ్రి ఆరోపించారు. ఈ కేసులో రియా చక్రవర్తి కారణమని ఆరోపణలు రాగా.. కేసులో ఆమెతో పాటు సోదరుడు సైతం అరెస్టయ్యారు. సంవత్సరాలు గడుస్తున్నా ఇప్పటికీ సుశాంత్ డెత్ మిస్టరీగానే మిగిలిపోయింది.
X
Google News
Facebook
Instagram
Youtube
Telegram