Aishwarya Rajesh | చీరకట్టులో..నగలతో ఐశ్వర్య కనువిందు
చీరకట్టులో ఆకట్టుకుంటున్న నటి ఐశ్వర్య రాజేశ్ తాజా ఫోటోలు వైరల్ అవుతున్నాయి. నిండైన భారతీయతను ప్రతిబింబిస్తూ మెరిసే నగలు, క్లాసీ లుక్స్‌తో అభిమానులను అలరిస్తోంది. 'సంక్రాంతికి వస్తున్నాం' వంటి హిట్ సినిమాలతో గుర్తింపు తెచ్చుకున్న ఈ నటి 'ఎక్స్' వేదికగా మళ్లీ సందడి చేస్తోంది.

Aishwarya Rajesh | విధాత : సంక్రాంతికి వస్తున్నాం సినిమాతో తెలుగు ప్రేక్షకులను అలరించిన నటి ఐశ్వర్య రాజేశ్ ఎక్స్ వేదికగా తన ఫోటోలతో సందడి చేసింది. నిండైన తెలుగుదనం..భారతీయత ఉట్టిపడేలా చీరకట్టులో..మెడలో దగదగ మెరిసే రత్నాభరణం లక్ష్మీహరంతో, వయ్యారి నడుముకు వడ్డాణంతో మధుర దరహాసాలు..విరహా వేదనల ఫోజులతో మెరిసిపోయింది. తెలుగులో 2019లో కౌసల్య కృష్ణమూర్తితో ఎంట్రీ ఇచ్చిన ఐశ్వర్య రాజేశ్ కు వరల్డ్ ఫేమస్ లవర్, టక్ జగదీశ్, వరం చిత్రాలు నిరాశ పరిచినప్పటికి.. సుధీర్ఘ నిరీక్షణ అనంతరం సంక్రాంతికి వస్తున్నాం సినిమాతో మంచి హిట్ అందుకుంది. అనిల్ రావిపూడి దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమాతో సీనియర్ హీరో విక్టరీ వెంకటేశ్ తో కలిసి భారీ విజయం అందుకున్న ఐశ్వర్య రాజేశ్ తదుపరి గరుడ 2.0 చిత్రంతో ప్రేక్షకులను ఎంటర్ టైన్ చేసింది. ఆమె రాబోయే చిత్రాలపై క్లారిటీ లేనప్పటికి..ఎక్స్ వేదికగా తన ఫోటోలతో ప్రేక్షకులకు నేనున్నానంటూ గుర్తు చేసి ఆకట్టుకుంటుంది.